E-Paper
Advertisement

Mega Twins: మెగా వారసులు వచ్చేస్తున్నారు.. డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన ఉపాసన!

Mega Twins: మెగా వారసులు వచ్చేస్తున్నారు.. డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన ఉపాసన!
Advertisement

Mega Twins: ఈ ఏడాది మెగా కుటుంబానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏడాది మొదట్లోనే మెగా బాస్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగా కుటుంబానికి సరైన హిట్టు సినిమాలు లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక చిరు సినిమా సక్సెస్ అవడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ఇక పోతే ఈ ఏడాది మెగా కుటుంబం నుంచి మరో బిగ్ గుడ్ న్యూస్ రాబోతున్న సంగతి తెలిసిందే.

మెగా వారసులు రాబోతున్నారా…

మెగా సామ్రాజ్యంలోకి అతి త్వరలోనే మెగా వారసులు అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన(Upasana) రాంచరణ్(Ramcharan) దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు అమ్మాయి జన్మించారు. ఈ చిన్నారికి క్లిన్ కారా (Klinkaara) అని నామకరణం చేశారు. ఈ చిన్నారి జన్మించిన మరో రెండు సంవత్సరాలకు ఉపాసన దంపతులు మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు. ఉపాసన రెండోసారి తల్లి కాబోతుందని విషయాన్ని తెలియజేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ విషయాన్ని ఉపాసన అధికారకంగా తెలియజేయడమే కాకుండా తన సీమంతపు వేడుకలకు సంబంధించి వీడియోని కూడా షేర్ చేశారు. ఇలా ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కవల పిల్లలు జన్మించబోతున్నట్టు తెలియజేయడంతో మెగా అభిమానుల ఆనందం కూడా రెట్టింపు అయింది.

జనవరి 31వ తేదీ..

Advertisement

ఈసారి ఉపాసన ఖచ్చితంగా మగ పిల్లలకు జన్మనివ్వబోతున్నారని ఒకేసారి ఇద్దరు వారసులు మెగా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఉపాసనకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయిందని త్వరలోనే మెగా సామ్రాజ్యంలోకి వారసులు రాబోతున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. జనవరి 31వ తేదీ ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చిన్న బ్రేక్ ఇవ్వబోతున్న చరణ్..

Advertisement

ఇలా ఉపాసన డెలివరీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మెగా కుటుంబం నుంచి అధికారకంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదివరకే రామ్ చరణ్ కు కూతురు ఉండడంతో ఈసారి కొడుకులైతే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మెగవారసుల రాక ఎప్పుడు? ఎవరు జన్మించబోతున్నారనే విషయాలు తెలియాల్సింది. ఇక ఉపాసన డెలివరీ డేట్ దగ్గర పడటంతో రామ్ చరణ్ కూడా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది’

Also Read: Mrunal Thakur: ఆమె నాకు స్ఫూర్తి… స్టార్ హీరోయిన్ పై మృణాళ్ కామెంట్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×