E-Paper
Advertisement

USA Telugu News: అమెరికాలో ఐసీఈ అరాచకం.. తెలుగు వారిపై ప్రత్యేక నిఘా.. రోజుకు 3,000 అరెస్టులే లక్ష్యం

USA Telugu News: అమెరికాలో ఐసీఈ అరాచకం.. తెలుగు వారిపై ప్రత్యేక నిఘా.. రోజుకు 3,000 అరెస్టులే లక్ష్యం

USA Telugu News: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మెట్రో సర్జ్’ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే నగరాల్లో ఐసీఈ (ICE) మరియు ఫెడరల్ ఏజెంట్లు జరుపుతున్న ఆకస్మిక దాడులు, అరెస్టులు అక్కడి భారతీయ సమాజాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.

ట్రంప్ యంత్రాంగం రోజుకు కనీసం 3,000 మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పని ప్రదేశాలు, పాఠశాలలు, చివరకు నివాసాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ పే గ్రీన్ కార్డులు, వీసా ఉల్లంఘనల కేసుల్లో తెలుగు వారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో అధికారులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మిన్నియాపాలిస్‌లో స్కూల్ నుంచి వస్తున్న 5 ఏళ్ల లియామ్ (Liam) అనే బాలుడిని, అతని తండ్రిని ఐసీఈ ఏజెంట్లు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. బాలుడిని ఎరగా చూపి అతని తండ్రిని పట్టుకున్నారని స్థానిక విద్యాశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.

అమిన్నియాపాలిస్‌లో ఐసీఈ ఏజెంట్ల అరెస్టులను మొబైల్‌లో వీడియో తీస్తున్న అలెక్స్ ప్రెట్టి (Alex Pretti) అనే అమెరికన్ పౌరుడిని ఫెడరల్ ఏజెంట్లు కాల్చి చంపడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. అతను ఒక ఐసీయూ నర్స్ మరియు మాజీ సైనికులకు సేవలు అందించే వ్యక్తి. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ రాయిటర్స్ నిర్వహించిన తాజా పోల్ ప్రకారం.. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. గతంలో 45% ఉన్న ఆమోద రేటు ప్రస్తుతం 39%కి పడిపోయింది. దాదాపు 53% మంది ప్రజలు ఈ కఠిన విధానాలను వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం మిన్నియాపాలిస్, ఇండియా పొలిస్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఐసీఈ అరాచకాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులను ఫెడరల్ ఏజెంట్లు ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Read Also: HIV Injection Case: కర్నూలు హెచ్ఐవి ఇంజక్షన్ కేసులో బిగ్ ట్విస్ట్.. పాత స్నేహంతోనే బ్లడ్ శాంపిల్ చోరీ..

Related News

Romania Road Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు ఫుట్‌బాల్ అభిమానులు దుర్మరణం! 

H1b Visas: H–1B వీసాలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం

US Snow Storm: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్‌.. 25 మంది మృతి, అంధకారంలో పలు నగరాలు

Mexico: మెక్సికో సాకర్ మైదానంలో దారుణం.. 11 మంది మృతి, ఆ ముఠా పనే?

Indian Yarn vs Bangladesh Mills: బంగ్లా వస్త పరిశ్రమ కొత్త డిమాండ్.. భారత్‌పై ఒత్తిడి, డ్యూటీ ఫ్రీ ఇష్యూ

Philippines Ferry Accident: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం..సముద్రంలో మునిగిన ఫెర్రీ, గల్లంతైనవారి

America: అమెరికాలో దారుణం.. రెండేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్‌ అధికారులు

Big Stories

×