E-Paper
Advertisement

Mega Victory Mass song: ఆర్ యూ రెడీ.. మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసిందిరోయ్!

Mega Victory Mass song: ఆర్ యూ రెడీ.. మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసిందిరోయ్!
Advertisement

Mega Victory Mass song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) నయనతార (Nayanatara)ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు. అయితే ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు చిరంజీవి, వెంకటేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారని తెలుస్తోంది. ఆర్ యు రెడీ అంటూ సాగిపోయే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించబోతోంది. ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ విడుదల కావడంతో ఈ పాట కాస్త ట్రెండింగ్ లోకి వచ్చింది.ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా నక్ష, విశాల్ ఆలపించారు. ఈ ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు విజయ్ పోలకి కొరియోగ్రఫీ అందించారు ఇక ఈ సినిమాకు బీమ్స్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే.

మీసాల పిల్ల సాంగ్..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రాబోతోంది అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమా పట్ల కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి విడుదల చేస్తున్న అప్డేట్స్ కూడా సినిమా పట్ల భారీ హైప క్రియేట్ చేశాయి . ఇప్పటికే ఈ సినిమా నుంచి మీసాల పిల్ల పాట భారీ ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే శశిరేఖ పాట కొన్ని విమర్శలను ఎదుర్కొన్న మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తాజాగా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న మెగా విక్టరీ సాంగ్ విడుదల చేశారు.

Advertisement

ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇద్దరి కాంబినేషన్లో మాస్ సాంగ్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ పాటను థియేటర్లో చూడటం కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ దాదాపు 20 నిమిషాల పాటు తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఇటు వెంకటేష్ అభిమానులకు మెగా అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పాలి. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లు ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో వెంకటేష్ సందడి చేయబోతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: Mohanlal Mother Death: నటుడు మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×