E-Paper
Advertisement

Upcoming Tesla cars india: మోడల్ 3 TO మోడల్ X.. టెస్లా నుంచి లాంచ్ కాబోయే క్రేజీ కార్లు ఇవే!

Upcoming Tesla cars india: మోడల్ 3 TO మోడల్ X.. టెస్లా నుంచి లాంచ్ కాబోయే క్రేజీ కార్లు ఇవే!
Advertisement

Upcoming Tesla cars india 2026: అపర కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా నుంచి 2026లో మూడు మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న మోడల్స్ తో పోల్చితే మరింత అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి రాబోతున్నాయి. 2026లో ముందుగా మోడల్ 3 కారు విడుదలకానుంది. ఇతర మోడల్స్ (మోడల్ S, మోడల్ X) కూడా రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్లా ఇండియాలో మోడల్ Yని 2025లో లాంచ్ చేసింది. ఇప్పటికే డెలివరీలను ప్రారంభించింది.  దీని ధర రూ. 59.89 లక్షల నుంచి అందుబాటులో ఉంది.

2026లో లాంచ్ కాబోయే టెస్లా  మోడల్స్  

 

⦿  టెస్లా మోడల్ 3 (Tesla Model 3)

Advertisement

టెస్లా నుంచి 2026లో  రాబోతున్న క్రేజీ కారు టెస్లా మోడల్ 3 (Tesla Model 3). ఈ కారు జనవరి 2026లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు అంచనా ధర రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.  ఇంపోర్ట్ డ్యూటీలతో సహా, వేరియంట్ ఆధారంగా ధరలు ఉంటాయి.

ముఖ్యమైన వివరాలు

Advertisement

❂ ఇది ఎలక్ట్రిక్ మిడ్-సైజ్ సెడాన్.

❂రేంజ్: 500-600 కి.మీ. వరకు (WLTP స్టాండర్డ్ ప్రకారం, లాంగ్ రేంజ్ వేరియంట్).

❂ పర్ఫార్మెన్స్: 0-100 కి.మీ./గం 5 సెకన్ల లోపు అందుకుంటుంది.

⦿ కీలకమైన ఫీచర్లు

ఈ కారులో 15.4-ఇంచ్ సెంట్రల్ టచ్‌ స్క్రీన్, రియర్ 8 ఇంచ్ స్క్రీన్, ఆటోపైలట్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కెపాబిలిటీ, ప్రీమియం ఆడియో, వెంటిలేటెడ్ సీట్లు, గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ అవకాశం ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే,  5 స్టార్ రేటింగ్ (గ్లోబల్), మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది. సూపర్‌ ఛార్జర్‌ తో 0-80% 40 నిమిషాల్లో ఉంటుంది.

2026లో వచ్చే ఇతర మోడల్స్  

Read Also:  మారుతి సుజుకి విక్టోరిస్- హోండా సిటీ e:HEV.. పెట్రోల్, హైబ్రిడ్ లో ఏది బెస్ట్?

⦿ టెస్లా మోడల్ S

ఫ్లాగ్‌ షిప్ సెడాన్ గా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 1.5 కోటి పైన ఉండనుంది. ఈ కారు రేంజ్ 600 కి.మీకి పైగా ఉంటుంది. ఈ కారు జనవరి 2026 లేదంటే మే 2026లో లాంచ్ కానుంది.

⦿ టెస్లా మోడల్ X

ఈ కారు SUVగా మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఫాల్కన్ డోర్స్ ఉంటాయి. ధర రూ. 1.5 కోటి పైనే ఉంటుంది. 2026 ఎండింగ్ లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

టెస్లా కార్లు పూర్తిగా ఇంపోర్ట్ చేసి విక్రయిస్తోంది, ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాన్ ఇంకా లేదు. ధరలు ఇంపోర్ట్ డ్యూటీల వల్ల ఎక్కువగా ఉంటాయి, కానీ, టెస్లా సూపర్‌ ఛార్జర్ నెట్‌ వర్క్ విస్తరిస్తోంది. ఇండియాలో లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ (గిగాఫ్యాక్టరీ) ప్లాన్ 2026లో లేదంటే 2027లో ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×