E-Paper
Advertisement

Mega 158: చిరంజీవి బాబీ సినిమాకు ముహూర్తం ఫిక్స్… రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?

Mega 158: చిరంజీవి బాబీ సినిమాకు ముహూర్తం ఫిక్స్… రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే?
Advertisement

Mega 158 : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి సినిమాపై అభిమానులలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబి (Bobby)డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది . చిరంజీవి సినీ కెరియర్ లో ఈ సినిమా 158 వ సినిమా కావటం విశేషం. నిజానికి ఈ సినిమా గత ఏదాడి షూటింగ్ పనులను ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

మార్చి 3 న మెగా 158 పూజా కార్యక్రమం..

ఇక ఈ ఏడాదిలో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు మార్చి 3 వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం మార్చి 3 వ తేదీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా ఏప్రిల్ 1 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.

చిరంజీవి జోడిగా ప్రియమణి..

Advertisement

ఇక ఈ సినిమా కలకత్తా గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో చిరంజీవికి(Chiranjeevi) జోడిగా సీనియర్ నటి ప్రియమణి(Priyamani) హీరోయిన్ గా నటించబోతున్నారు అలాగే చిరంజీవి కూతురు పాత్రలో ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది అలాగే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో కూడా ఉండబోతుంది. ఈ పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

2027 సంక్రాంతి టార్గెట్..

Advertisement

ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి షోల్డర్ సర్జరీ కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోరుకుంటున్నానని స్వయంగా చిరంజీవి తెలియచేశారు.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ పనులను త్వరలోనే ప్రారంభించి 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే చిరంజీవి బాబి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Arjun Ambati: ఫస్ట్ టైం కూతురుని పరిచయం చేసిన అర్జున్ అంబటి…అచ్చం తన పోలికలే అంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×