E-Paper
Advertisement

Kamal Rajinikanth Film: రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలో విలన్ గా మెగాస్టార్..!?

Kamal Rajinikanth Film: రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలో విలన్ గా మెగాస్టార్..!?
Advertisement

Kamal Rajinikanth Film: సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వనటుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న తాజా సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాను తాత్కాలికంగా ‘తలైవర్ 174’ అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హీరో ఎవరంటే..!

ఈ సినిమా పనులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ప్రమో వీడియోతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఆ ప్రమోలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ స్టైలిష్ లుక్స్‌లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన పవర్‌ఫుల్ మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంది. వీడియో చివరలో “హీరో ఎవరు?” అనే ప్రశ్నతో సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు.

విలన్ ఎవరంటే..!

Advertisement

ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనే విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ విలన్‌గా కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, విలన్ పాత్ర కోసం మరో పెద్ద నటుడిని సంప్రదించారట. ఆ నటుడు ఎవరో కాదు, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ మమ్ముట్టి అని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

నిజానికి గతంలో రజనీకాంత్ – నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సినిమాలోని విలన్ పాత్రకు ముందుగా మమ్ముట్టిని అనుకున్నారు. అయితే క్లైమాక్స్ విషయంలో కొంత గందరగోళం కారణంగా ఆయన ఆ పాత్రను తిరస్కరించారని నెల్సన్ స్వయంగా తెలిపారు. ఇటీవలి కాలంలో మమ్ముట్టి నెగటివ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు నిజంగానే రజనీ–కమల్ సినిమాలో ఆయన విలన్‌గా వస్తే, సినిమాపై హైప్ రెట్టింపు కావడం ఖాయం.

Advertisement

ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉధయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి ఒకే సినిమాలో కనిపిస్తే, అది భారతీయ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

 

Also Read: The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ 2’ రిలీజ్‌కు కేరళ హైకోర్టు బ్రేక్.. సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం

 

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×