E-Paper
Advertisement

India vs Zimbabwe: సంజును బండ‌బూతులు తిట్టిన గంభీర్‌…టీమిండియా స్కోర్ 250 క్రాస్‌

India vs Zimbabwe: సంజును బండ‌బూతులు తిట్టిన గంభీర్‌…టీమిండియా స్కోర్ 250 క్రాస్‌
Advertisement

India vs Zimbabwe: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ టోర్నమెంట్ సందర్భంగా జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ చెన్నై లోని ఎమ్ఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రింకూ సింగ్ స్థానంలో ఎట్టకేలకు సంజు శాంస‌న్‌ కు అవకాశం వచ్చింది. దీంతో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంస‌న్‌, 15 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే ఒక బౌండరీ ఉంది. మంచి స్టార్టింగ్ అందుకున్న సంజు, పెద్ద ఇన్నింగ్స్ ను మలచడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిన సంజు శాంస‌న్‌ కు గంభీర్ కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే, వీళ్ల సంభాష‌ణ‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. తొందరగా ఔట్ అయినందుకు సంజు శాంస‌న్‌ను గంభీర్ తిట్టాడని కొంతమంది ఈ అంశంపై పోస్టులు పెడుతున్నారు. ఇంకేన్ని ఛాన్సులు ఇవ్వాల‌ని గంభీర్ సీరియ‌స్ అయిన‌ట్లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇక‌ మరికొంతమంది సంజుకు గంభీర్ స‌లహా సూచనలు ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారారు.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియా స్కోర్ 250 క్రాస్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా , 256 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా సునామీ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. టీమిండియా 256 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 257 ప‌రుగులు సాధిస్తే, జింబాబ్వే విజ‌యం సాధించ‌నుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు కసిగా ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు సంజు 24 పరుగులతో టచ్ లోకి వచ్చాడు. అటు అభిషేక్ శర్మ చాలా రోజుల తర్వాత అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 30 బంతుల 55 పరుగులు సాధించి ఇరగదీశాడు అభిషేక్ శర్మ.

ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. అటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి రఫ్పాడించాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టెస్టు ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో 275 స్ట్రైక్ రేటుతో 44 పరుగులు సాధించాడు తిలక్ వర్మ. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు ఉన్నాయి. ఇంకా ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 257 పరుగులు చేస్తే జింబాబ్వే విజయం సాధిస్తుంది.

Advertisement

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×