E-Paper
Advertisement

Samantha MIB: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని సమంత జోరు.. టీజర్ ట్రైలర్ రికార్డ్!

Samantha MIB: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని సమంత జోరు.. టీజర్ ట్రైలర్ రికార్డ్!
Advertisement

Samantha MIB:సాధారణంగా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ సొంతం చేసుకున్న తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే.. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మరి కొంతమంది హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో సమంత (Samantha) కూడా ఒకరు. గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించని ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రానికి సహ.నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే ఈమె భర్త రాజ్ నిడిమోరు(Raj Nidimoru) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రికార్డ్ క్రియేట్ చేసిన మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్..

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారి నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. ఇటీవల ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ మేకర్స్ టీజర్ ట్రైలర్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎట్టకేలకు ఆ టీజర్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఇందులో సమంత ఈజ్ బ్యాక్ అనేలా ఆమె పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఒకవైపు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూనే.. మరొకవైపు అత్తవారింటిని మెప్పించే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత సమంత నటించిన సినిమా నుండి ఈ టీజర్ ట్రైలర్ రావడంతో.. దీనిని చూడడానికి తెగ ఆసక్తి కనబరిచారు ఫ్యాన్స్..ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ టీజర్ ట్రైలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే 20 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని జోరు..

Advertisement

ఇకపోతే చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు తగ్గించడం లేదు అని ఈ టీజర్ ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ALSO READ:HBD Sukumar: సుకుమార్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం?

సమంత కెరియర్..

Advertisement

గత ఏడాదికి పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె గత ఏడాది చివర్లో రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. అలాగే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి శుభం అనే సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ గా మళ్లీ అడుగు పెట్టింది. అలాగే హిందీలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఈ వెబ్ సిరీస్ కి ఈమె భర్త రాజ్ నిడిమోరు తన స్నేహితుడు డీకేతో కలిసి దర్శకత్వం వహిస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×