E-Paper
Advertisement

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఇప్పటికి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలోనే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా తన సినిమాల పనులలో చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం తనకు వీలైనప్పుడల్లా కొత్త సినిమాలను వెబ్ సిరీస్ లను చూస్తూ వాటికి తన రివ్యూలను ఇవ్వడం సదరు ఆర్టిస్టులను నటీనటులను ప్రోత్సహించడం చేస్తుంటారు. ఇలా ప్రతి ఒక్క సినిమా పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తన కుమార్తె సుస్మిత కొనిదెల(Susmitha Konidela) నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగమే సంగీతం (Jagame Sangeetham) అనే వెబ్ సిరీస్ గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

జగమే సంగీతం చాలా ఎంజాయ్ చేశాను…

సుస్మిత కొణిదెల నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ వెబ్ సిరీస్ చూసినట్లు తెలియచేశారు. ఇలా చిరంజీవి ఈ సిరీస్ చూసిన అనంతరం సిరీస్ పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.”ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’ సిరీస్ చూశా. ఎంతగానో ఎంజాయ్ చేశా. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్, విజువల్స్, ఆత్మను తాకే సంగీతంతో బ్యూటీఫుల్లీ క్రాఫ్టెడ్ సిరీస్ ఇది’’ అంటూ సిరీస్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

నా కూతురిని చూస్తుంటే గర్వంగా ఉంది…

Advertisement

ఇక ఈ సిరీస్ నిర్మించిన తన కుమార్తె సుస్మిత కొణిదెల గురించి కూడా ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావిస్తూ..ఇలాంటి క్లాసిక్, హృదయానికి హత్తుకునే సిరీస్‌ను ప్రేక్షకులకు అందించినందుకు నా కూతురు సుస్మితా కొణిదెలను, అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపారు. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి నిజంగానే ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారని ఈ సిరీస్ కోసం కృషి చేసిన టెక్నీషియన్లు, నటీనటులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

ఇలా తమ వెబ్ సిరీస్ పట్ల చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ ఈ పోస్ట్ చేయడంతో సుస్మిత సైతం తన తండ్రి చేసిన పోస్ట్ పట్ల స్పందిస్తూ తన తండ్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడమే కాకుండా తన తండ్రి స్ఫూర్తి అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్ కి రివ్యూ ఇవ్వడంతో ఈ సిరీస్ కు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో కాకా(Kaaka) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ సినిమా హైదరాబాదులో నిర్మించిన ఒక ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ చిత్రాన్ని జనవరి 13 ,2027న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

Related News

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

Big Stories

Advertisement
×