E-Paper
Advertisement

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్
Advertisement

India Women vs Pakistan Women Women’s Asia Cup 2026:  ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మహిళల ( India Women vs Pakistan Women, Match 9) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 55 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు 18.1 ఓవర్లు ఆడిన పాకిస్తాన్.. ఆ 55 పరుగులు చేసేందుకు నరకయాత‌న అనుభవించింది. పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ఓపెనర్లు మునిబా అలీ, షవాల్ జుల్ఫికర్ (Shawaal Zulfiqar) మినహా అందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు వెళ్లారు. పాకిస్తాన్ టీ20 కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు మరో ముగ్గురు డక్ అవుట్ అయ్యారు. దీంతో మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై ట్రోలింగ్ మొదలైంది. అటు ఇండియ‌న్ ఎయిర్ బేస్ ల‌ను పేల్చేశామంటూ ఫాతిమా సనా గ‌తంలో చేసిన సైగ‌ల వీడియో కూడా వైర‌ల్ గా మారింది.

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 8 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు 18.1 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ మహిళల జట్టు 55 పరుగులకు కుప్పకూలింది. శ్రీ చరణి, ప్రేమ రావత్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ రెండు వికెట్లతో రాణించగా షఫాలీ వర్మకు ఒక వికెట్ పడింది.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

టీమిండియాతో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా డక్ అవుట్ అయ్యారు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా కూడా ఫాతిమా స‌నా… టీమిండియా పై ఒక్క పరుగు చేయకుండానే వికెట్ సమర్పించుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పేల్చేసినట్లు బౌండరీ గేటు దగ్గర ఫాతిమా ఓవరాక్షన్ చేశారు. అయితే ఆ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ.. ఇండియన్ ఎయిర్ బేస్ లు కాదు.. మీ పాకిస్తాన్ క్రికెట్ జట్టు కుప్పకూలిందని కౌంటర్లు పేల్చుతున్నారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

పాకిస్తాన్ పై టీమిండియా మ‌రో విజ‌యం…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

Big Stories

Advertisement
×