E-Paper
Advertisement

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!
Advertisement

Shekhar Master: శేఖర్ మాస్టర్ ప్రస్తుతం డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా డాన్సర్స్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న వివాదాల కారణంగా తరచూ శేఖర్ మాస్టర్(Shekhar Master) పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా డాన్సర్స్ అసోసియేషన్(Dancers Association) వివాదాల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య సుమలత(Sumalatha) శేఖర్ మాస్టర్ గురించి ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారు.

పుట్టుపూర్వోత్తరాల పై అనుచిత వ్యాఖ్యలు..

ఈ విధంగా సుమలత తన గురించి ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శేఖర్ మాస్టర్ తాజాగా సుమలతపై ఫెడరేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా తన మనోభావాలను దెబ్బతీసే విధంగా సుమలత సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడుతూ..కక్కితే కాళ్లు మీద పడతాయి అంటూ తన పట్ల ఎన్నో నిరాధారణమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా నా మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అందుకు సుమలత బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ఈయన డిమాండ్ చేస్తూ డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్(Raghu Master) అలాగే ఫెడరేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు.

సూపర్ హిట్ పాటలను వదులుకున్నాను..

Advertisement

సుమలత నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన విధానం పట్ల తాను మీడియా ముందుకు వస్తానని చెప్పాను అయితే కొంతమంది సినీ పెద్దలు ఈ వివాదం పట్ల గొడవలు చేస్తూ మీడియా ముందుకు రావద్దని చెప్పడంతోనే మౌనంగా ఉన్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు. యూనియన్ సభ్యుల సహాయ సహకారాలలోనూ అలాగే యూనియన్ సభ్యుల పర్సంటేజీ విషయంలో అన్యాయం జరుగుతుందని తాను ఎన్నో సూపర్ హిట్ పాటలను కూడా వదులుకున్నానని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ గుర్తు చేసుకున్నారు. యూనియన్ సభ్యుల కోసం ఎంతగానో తపనపడే తన పట్ల సుమలత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సుమలత స్పందన ఏంటీ…

శేఖర్ మాస్టర్ ఫెడరేషన్ లో సుమలత పట్ల ఫిర్యాదు చేశారు. మరి ఆమె స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. డాన్స్ షోలకు శేఖర్ మాస్టర్ జడ్జిగా కూడా కొనసాగుతూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల శేఖర్ మాస్టర్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్ కూడా కొరియోగ్రఫీ అందించగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Related News

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

Big Stories

Advertisement
×