E-Paper
Advertisement

Megastar Chiranjeevi : బ్రదర్ వెంకటేష్ ఆ పది రోజులు నేను మర్చిపోలేను, విక్టరీ పై మెగాస్టార్ కామెంట్స్

Megastar Chiranjeevi : బ్రదర్ వెంకటేష్ ఆ పది రోజులు నేను మర్చిపోలేను, విక్టరీ పై మెగాస్టార్ కామెంట్స్
Advertisement

Megastar Chiranjeevi : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే అని చాలా తక్కువ మంది దర్శకులు నమ్ముతారు. అందులో అనీల్ రావిపూడి ఒకరు. అందుకనే ఇప్పటివరకు అనిల్ చేసిన ప్రతి సినిమాకి కూడా ఎక్కువగా వినోదానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే వర్కౌట్ అయ్యాయి. కొంతమంది యూత్ అనిల్ రావిపూడి సినిమాల్లోని కామెడీకి రకరకాల పేర్లు పెడతారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతను సినిమాలకి బ్రహ్మరథం పడతారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 2025లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు అనిల్. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మళ్ళీ సంక్రాంతి టార్గెట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రాక్షకులు ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కనిపించనున్నారు.

బ్రదర్ ఆ పది రోజులు మర్చిపోలేను 

Advertisement

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. పది రోజులు పాటు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా లో పాల్గొన్నారు వెంకటేష్. ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించాలి అనే డ్రీమ్ వెంకటేష్ కు ఉంది. మొత్తానికి అది అనిల్ రావిపూడి సినిమా వలన నెరవేరి పోయింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా విక్టరీ వెంకటేష్ షేర్ చేసుకున్నారు.

వెంకటేష్ ట్వీట్ కు మెగాస్టార్ చిరంజీవి రీ పోస్ట్ చేస్తూ, బ్రదర్ వెంకటేష్. ఈ పది రోజులు జరిగిన షూటింగ్ని జీవితంలో మర్చిపోలేను నీతో కలిసి పని చేయటం ఒక పాజిటివ్ ఎనర్జీ ను ఇచ్చింది అంటూ రియాక్ట్ అయ్యారు

Advertisement

అనిల్ మాస్టర్ ప్లాన్ 

అనిల్ రావిపూడి అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సినిమాలు వర్కౌట్ అవుతాయో వాటిని మాత్రమే తీస్తుంటారు. అనిల్ కు కొంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు. అందుకనే తన సినిమా ప్రమోషన్స్ లో కూడా వాళ్లకు కనెక్ట్ అయ్యే కంటెంట్ ను రెడీ చేస్తూ ఉంటాడు.

మొత్తానికి చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమాను చేస్తున్నారు. అందుకే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా మినహాయిస్తే అంతకు ముందు సినిమాల్లో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కంప్లీట్ గా మిస్ అయిపోయింది. ఇప్పుడు అనిల్ రావిపూడి దానిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 300 కోట్లు వచ్చింది మరి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అని ఆసక్తి కూడా చాలామందిలో నెలకొంది. ఇది సంక్రాంతికి తేలుతుంది

Also Read: Drishyam 3 : భారీ అంచనాలు సినిమా కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×