E-Paper
Advertisement

Drishyam 3 : భారీ అంచనాలు సినిమా కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి

Drishyam 3 : భారీ అంచనాలు సినిమా కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి
Advertisement

Drishyam 3 : కొన్ని సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలకి అభిమానులు అయిపోయారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక తెలుగు సినిమా ఒక మలయాళం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటే ఎక్కువ శాతం మంది మలయాళం సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ విషయం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు.

అందుకే హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా పొరుగింటి పుల్లకూర రుచి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మిగతా భాషలో సినిమాలని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని స్టేజ్ మీద కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే దృశ్యం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మలయాళం లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేశారు.

భారీ అంచనాల సినిమా 

Advertisement

మరోవైపు ఈ సినిమా మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి గుర్తుచేయక్కర్లేదు. ఎందుకంటే ఇదివరకే వచ్చిన దృశ్యం దృశ్యం 2 సినిమాలు విపరీతంగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు దృశ్యం 3 సినిమా సిద్ధం అయిపోయింది. మరోవైపు ఈ సినిమా థియేటర్ బిజినెస్ 350 కోట్లు ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైనట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి దీటుగా మలయాళం ఇండస్ట్రీ నిలబడుతుంది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు అధికారికంగానే ప్రకటించారు.

కేవలం రెండు నెలల్లో పూర్తి 

Advertisement

ఈ సినిమా మీద ఎన్ని భారీ అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాను కేవలం 54 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. మోహన్లాల్ వంటి స్టార్ హీరోతో ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్రాజెక్టును కేవలం 54 రోజుల్లో పూర్తి చేశారు అంటే అది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి.

ఇలా తక్కువ రోజుల్లో షూటింగ్ స్ఫూర్తి చేయడం వలన థియేటర్లో ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అలా స్టార్ హీరోలు సినిమాలు ఎక్కువగా విడుదలవడం వలన ప్రేక్షకులు కూడా పదేపదే థియేటర్ కు రావడానికి ఇష్టపడుతుంటారు. తెలుగులో కూడా ఇలాంటి పరిణామాలు జరిగితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా ఇప్పటికే చాలామందికి మొదలైంది.

Also Read: Balakrishna Nandamuri: అమ్మ కడుపులోనే జై బాలయ్య అని విన్నాను

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×