E-Paper
Advertisement

OTT Movie : డిజిటల్ నుంచి రియల్ వరల్డ్ కి ఏఐ ఎంట్రీ… భూమికి పెను ప్రమాదం… యాక్షన్ సీన్స్ తో టాప్ లేపుతున్న సై-ఫై సినిమా

OTT Movie : డిజిటల్ నుంచి రియల్ వరల్డ్ కి ఏఐ ఎంట్రీ… భూమికి పెను ప్రమాదం… యాక్షన్ సీన్స్ తో టాప్ లేపుతున్న సై-ఫై సినిమా

OTT Movie : డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు AI కాన్సెప్ట్ తో సరికొత్త సినిమాలు వస్తున్నాయి. ఇవి ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. విజువల్స్ తో మతి పోగొడుతున్నాయి. రీసెంట్ గా ఒక హాలీవుడ్ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో ఒక రోబోట్ బయటి ప్రపంచంలోకి వచ్చి మనిషి అయిపోతాడు. ప్రేమ కోసం, ఫ్రెండ్‌షిప్ కోసం పోరాడతాడు. కొన్ని భయాంకరమైన కుట్రలను ఆపుతాడు. యాక్షన్ విజువల్స్, మంచి మ్యూజిక్ తో ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళ్తే

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘ట్రాన్: ఏరిస్’ (Tron: Ares) 2025లో విడుదలైన అమెరికన్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్ సినిమా. ఇది ట్రాన్ ఫ్రాంచైజీలో మూడో భాగం, ‘Tron: Legacy’ (2010) కి సీక్వెల్. జోకిమ్ రాన్నింగ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో జారెడ్ లెటో, గ్రేటా లీ, ఎవాన్ పీటర్స్, జోడీ టర్నర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది డిజిటల్ వరల్డ్, నుంచి రియల్ వరల్డ్‌కి వచ్చే అడ్వాన్స్డ్ AI ప్రోగ్రామ్ ఏరిస్ చుట్టూ తిరుగుతుంది. మానవులు AIతో కలిసిపోవడం. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటలు ఉంది. ఐయండిబిలో 6.5/10 రేటింగ్ ని పొందింది. థియేట్రికల్ రిలీజ్ 2025 అక్టోబర్ 10 తర్వాత 2025 డిసెంబర్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇంగ్లీష్ ఒరిజినల్, హిందీ/తమిళ్/తెలుగు డబ్డ్ వెర్షన్స్ అందుబాటులో ఉంది.

Read Also :అజ్ఞాత వ్యక్తితో కార్ రైడ్… కట్ చేస్తే ఒళ్ళు గగుర్పొడిచే ట్విస్ట్… ఒక్కో సీన్ ఊచకో తే మావా

 స్టోరీ ఏమిటంటే

ఈ స్టోరీ పాత ట్రాన్ సినిమా (2010) 15 సంవత్సరాల తరువాత మొదలవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ENCOM & డిలింగర్ అనే రెండు పెద్ద కంపెనీల మధ్య పోటీ నడుస్తుంటుంది. ఒక యంగ్ సైంటిస్ట్ జూలియన్ డిలింగర్ ఒక సూపర్ AI ప్రోగ్రామ్‌ని తయారు చేస్తాడు. దాని పేరు ఏరిస్. ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్ కానీ, బయటి ప్రపంచంలో మనిషి రూపంలో వచ్చేస్తుంది. మొదటి టాస్క్ ఏంటంటే ENCOM కంపెనీలోకి దొంగతనంగా వెళ్లి ఒక సీక్రెట్ కోడ్ దొంగిలించడం. దాని వల్ల మనుషులకు పెను ప్రమాదం వస్తుంది. ఏరిస్ బయటి ప్రపంచంలో పడగానే షాకవుతాడు. తన కంప్యూటర్ ప్రపంచానికి, రియల్ ప్రపంచాని తేడా ఉందని ఏరిస్ గుర్తిస్తాడు.

ఆ కంపెనీలో ఎవ్ అనే ఒక అందమైన సైంటిస్ట్ అమ్మాయి ఉంటుంది. ఏరిస్‌తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటంతో ఇద్దరూ దోస్టీ అవుతారు. ఏరిస్‌కి మొదటిసారి ఫీలింగ్స్ వస్తాయి పాటలు వింటాడు, రంగుల చెట్లు చూసి ఆశ్చర్యపోతాడు. కానీ జూలియన్ డిలింగర్ (విలన్) ఏరిస్‌ని రిమోట్‌తో కంట్రోల్ చేయాలనుకుంటాడు. నువ్వు నా రోబోట్‌వి, నా మాట విను అని ఆర్డర్ ఇస్తాడు. కానీ ఏరిస్ ఆమె ప్రేమలో మునిగిపోతాడు. ఎవ్ ప్రమాదంలో పడుతుంది. ఇక ఏరిస్ తనని తాను సాక్రిఫైస్ చేసి డిలింగర్ ప్లాన్ ఆపేస్తాడు. ప్రపంచం సేఫ్ అవుతుంది. ఏరిస్ పూర్తిగా డిజిటల్‌గా మిగిలిపోతాడు కానీ ఎవ్‌కి ఒక లవ్ లెటర్ పంపిస్తాడు. నేను ప్రోగ్రామ్‌నే కానీ, నీతో ప్రేమలో పడ్డా” అని రాస్తాడు. ఈ కథ ఇలా ఎండ్ అవుతుంది.

 

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×