E-Paper
Advertisement

గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె నిశ్చితార్థం.. అల్లుడు ఎవరంటే?వైరల్ వీడియో !

గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె నిశ్చితార్థం.. అల్లుడు ఎవరంటే?వైరల్ వీడియో !
Advertisement

Mohana Engagement: తెలుగు ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి మొదలైంది.డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి.తన ఒక్కగానొక్క కూతురు మోహన ఎంగేజ్ మెంట్ అనిరుధ్ అనే అబ్బాయితో గ్రాండ్ గా జరిగింది.ఈ ఏడాది చివరలోనే మోహన-అనిరుధ్‌ల వివాహ బంధం ఘనంగా జరగనుందని తెలుస్తుంది.
అయితే ఈ వేడుక పోయిన ఏప్రిల్ 26నే అత్యంత సన్నిహితుల మధ్య జరగ్గా 12 రోజుల తర్వాత ఈ ఎంగేజ్ మెంట్ కి సంబందించిన స్పెషల్ గ్లింప్స్ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు మెహర్.అలా పోస్ట్ చేశాడో లేదో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

నమ్రత శిరోద్కర్ కుమార్తె సితార స్పెషల్ అట్రాక్షన్

Advertisement

ఇక ఈ ఈవెంట్ కి మొహర్ కి దగ్గర బందువులైన మెగాస్టార్ చిరంజీవి దంపతులు వచ్చి కాబోయే దంపతులని ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేష్, సీనియర్ యాక్టర్స్ శ్రీకాంత్, సునీల్ లతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరై సందడి చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన కుమార్తె సితారతో కలిసి వచ్చి ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.

ALSO READ :నారా లోకేష్ హీరో.. డైరెక్టర్ తేజ! 2002లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్.. అసలేం జరిగింది?

Advertisement

మెహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే

ఇక మెహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే పూరీ జగన్నాథ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలెట్టాడు మెహర్.అలా దర్శకత్వ శాఖలో చేస్తూనే 2002లో వచ్చిన మహేష్ బాబు ‘బాబీ’ సినిమాలో ఒక చిన్న పాత్రలో తళుక్కున మెరిశాడు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ తో సినిమాతో డైరెక్టర్ గా లాంచ్ కావడం విశేషం. పూరి దర్శకత్వంలో వచ్చి డిజాస్టర్ అయిన ఆంధ్రావాలాని కన్నడలో ‘వీర కన్నడిగ’పేరుతో రీమేక్ చేసి తొలి సినిమాతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెహర్.ఇక అదే ఊపులో మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమాను ‘అజయ్’ పేరుతో కన్నడలో తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేశాడు.

మరే హీరోతో అయినా జత కడతాడా?

అలా రెండు వరుస హిట్స్ కొట్టిన మెహర్ జర్నీ తెలుగులో తారక్ నటించిన ‘కంత్రి’తో మొదలైంది. స్టైలిష్ టేకింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్ట్ చేయలేకపోయింది.అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభాస్‌’బిల్లా’ (2009) మెహర్ రమేష్ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇప్పటికీ రెబల్ ఫ్యాన్స్ మళ్ళీ రిపీటేడ్ గా చూసే మూవీ ఇది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ ‘శక్తి’ (2011), వెంకటేష్ ‘షాడో’ (2013) తో పాటు చివరగా చిరుతో తీసిన ‘భోళా శంకర్’ (2023) సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయ్.మరి ముందు ముందు మరే హీరోతో అయినా జత కడతాడో చూడాలి.

ALSO READ :ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమా?

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×