E-Paper
Advertisement

BSNL సంచలనం.. ఇంత తక్కువకి నెలవారీ ప్లాన్ ఆ.. అది కూడా ఇన్ని బెనిఫిట్స్‌తో..!

BSNL సంచలనం.. ఇంత తక్కువకి నెలవారీ ప్లాన్ ఆ.. అది కూడా ఇన్ని బెనిఫిట్స్‌తో..!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తో కస్టమర్లను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఎయిర్ టెల్, జియో ప్లాన్స్ తో పోలిస్తే సగం ధరకే యూజర్లకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.225 ప్లాన్.. అత్యంత ప్రజాధరణను సంపాదించింది. మంత్లీ ప్లాన్స్ విభాగంలో ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకుంటున్న ప్లాన్ గా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రతీరోజూ 2.5GB డేటా..

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ ను డేటా యూజర్లను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్రతిరోజూ 2.5GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిసినా.. ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. 40Kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ లో డేటాతో పాటు.. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ఎవరికి లాభం?

Advertisement

యూట్యూబ్ వీడియోలు బాగా చూసేవారికి, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, ఇంటి వద్ద నుంచి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే విద్యార్థులకు కూడా ఈ ప్లాన్ బెస్ట్ అనిచెప్పవచ్చు. వారికి రోజుకు 2.5GB డేటా సరిపోతుంది. ఎయిర్ టెల్ లేదా జియో సిమ్ వాడుతూ ఉండి.. సెకండ్ సిమ్ గా బీఎస్ఎన్ఎల్ ఉంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకుంటే రోజుకు 2GB కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లు ఆయా నెట్ వర్క్స్ లో రూ.300పైనే ఉన్నాయి.

Also Read: అమెజాన్ స్పెషల్ ఆఫర్.. అత్యంత చౌకగా Bajaj కూలర్‌.. ఆలస్యం చేస్తే దొరకటం కష్టమే!

రీఛార్జ్ చేసుకోవడం ఎలా?

Advertisement

ఈ ప్లాన్‌ను వివిధ రకాల పద్దతుల్లో సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ (BSNL Selfcare App) డౌన్ లోడ్ చేసుకొని నెంబర్ తో లాగిన్ అవ్వడం ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. లేదంటే బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ప్లాన్ ను దక్కించుకోవచ్చు. మరోవైపు ఫోన్ పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సాయంతోనే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును బీఎస్ఎన్ఎల్ కల్పించింది.

Also Read:కొత్త ఏసీ కావాలా? 2026లో టాప్ మోడల్స్ ఇవే.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు!

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×