సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో 2,163 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.
కూకట్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. KPHB కాలనీలో హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్ మాములుగా ఉండట్లేదు. నిన్న రాత్రి రోడ్ నెంబర్ 5 లోని ఓ హాస్టల్‌లో ఒక అమ్మాయిని దింపడానికి ఓయువకుడు వెళ్లాడు. పక్కనే ఉన్న మరో యువకుడికి బైక్ హ్యాండిల్ తగిలి కింద పడడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ ఇష్యూలో హాస్టల్ ఓనర్, అతని కొడుకు కలగజేసుకున్నారు. దాంతోగొడవ మరింత పెద్దదిగా మారింది. ఇరువర్గాల మధ్య గొడవతో స్థానికులు ఆందోళన చెందారు. హాస్టల్స్‌తో తమకు ఇబ్బంది అని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేదంటున్నారు.
హైదరాబాద్‌లోని పుప్పాల్‌గూడ సర్వే నంబర్ 300లోని రోడ్డు విషయంలో పట్టాదారులకు, రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య వివాదం తలెత్తింది. అర్థరాత్రి వేళ జేసీబీలు, బౌన్సర్లతో వచ్చి ల్యాండ్‌లోని బోర్డులను తొలగించి, పహారీ గోడను ధ్వంసం చేశారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, దౌర్జన్యంగా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న వారిపై రౌడీలతో దాడులు చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యవసాయ పొలాన్ని కాపాడాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు నిరసనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దుశ్చర్యలకు నిరసనగా జనవరి మొదటి వారంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభుత్వం వైపు వెళ్లడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. అభివృద్ధి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో కలిసి ఉండటం వల్లే జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నానని.. నియోజకవర్గ ప్రయోజనాలే తనకు ముఖ్యమని విద్యార్థుల ముఖాముఖిలో ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలోని బెలఘర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గుమ్మా అటవీప్రాంతంలో.. మావోయిస్టులు-బలగాలకు మధ్య ఎదురు కా ల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘ టనా స్థలంలో రివాల్వర్, రైఫిల్‌తోపాటు వాకిటాకీ స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఏసీఎం బారి అలియాస్ రాకేష్ గా.. మరొకరు పీఎం అమృత్‌గా బలగాలు గుర్తించాయి. ఇద్దరు మావోయిస్టులపై 23లక్షల 65వేల రూపాయల రివార్డు ఉ న్నట్లు ప్రకటించారు. రాకేష్ రాయగడ ఏరియా కమిటీ సభ్యుడు కాగా.. పీఎం అమృత్ రాయగడ ఏరియా సప్లయ్ దళానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడలో ట్రాన్స్‌కో ఉద్యోగిని బురిడీ కొట్టించిన దుండగులు అకౌంట్‌లోని 13 లక్షలు కాజేశారు. ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్ మొబైల్‌కు ముందు ఒక APK ఫైల్‌ను పంపారు. తెలియకుండా లింక్ ఓపెన్ చేయడంతో మొబైల్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. ఉద్యోగి అకౌంట్ నుంచి మొత్తం 13 లక్షలు కొట్టేశారు. అకౌంట్‌లో ఉన్న అమౌంట్ కట్ అవ్వడంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమాగూడెం కల్వరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ప్రేమ, త్యాగమే పండుగ సందేశమని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రతి వర్గానికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా ఉప్పల్‌వాయిలో మహిళలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మద్యం బాటిళ్లు, కల్లు ప్యాకెట్లతో ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేశారు బాలవ్వ అనే మహిళ. అయితే.. ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మద్యం, కల్లు పంచినా ఓటెయ్యలేదంటూ అసభ్య పదజాలంతో తిడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలవ్వ తిట్లు భరించలేక మద్యం బాటిళ్లు, కల్లు ప్యాకెట్లు వెనక్కి ఇస్తామంటూ.. మహిళలు ఆందోళన చేపట్టారు.
శ్రీశైల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు సిఎస్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోల్గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో 200 కేజీల చికెన్, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన భక్తులను మందలించి, నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చికెన్, మటన్, చేపల మార్కెట్లపై ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కంట్రోల్ అధికారి రంగారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. కిలోకు 200 గ్రాముల వరకు తక్కువగా తూస్తున్నట్లు గుర్తించి.. 11 షాపులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వెయింగ్ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలం టేకూరిపేటలో వానరాలు మృతి కలకలం రేపుతోంది. రోడ్డుపై చచ్చి పడి ఉన్న సుమారు 30 వానరాలను స్థానికులు ఖననం చేశారు. టేకురుపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఘటన చోటుచేసకుంది. చనిపోయిన వానరాలన్నీ విద్యుత్ షాక్ కారణంగా మృత్యువాత పడినట్లు గ్రామస్తులు గుర్తించారు. గుట్టగా వానరాలు పడవేయడంపై పలు రకాలుగా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పోరుమామిళ్ల మండలం ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లా పరిధిలో పంట పొలాలకు పెట్టిన విద్యుత్ తీగలకు వానరాలు బలి అయ్యి ఉంటాయని వారు భావిస్తున్నారు. వానరాలు చనిపోయి, కుప్పగా పడవేసిన విషయం తెలిసినా స్థానిక అటవీ అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లా సులవాయికి చెందిన బోయ మల్లిపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పేకాట ఆడిస్తున్నాడనే నెపంతో మూడు రోజులుగా స్టేషన్‌లో చితకబాదారని.. డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చారని బాధితుడు ఆరోపిస్తూ గాయాలను చూపించాడు. నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 12 మందిపై కేసు నమోదు చేసి 97,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు
అన్నమయ్య జిల్లా రాయవరంలో ఎర్రచందనం పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో అధికారుల తనిఖీలు నిర్వహించారు. రవాణాకు సిద్ధంగా ఉన్న 30 ఎర్రచందనం దుంగలతో పాటు వ్యాన్‌ను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ 12 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ గోల్డ్ స్కామ్ జరిగింది. తక్కువ ధరకే బంగారం ఇస్తానని 10 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు నిందితుడు. యడ్లపాడుకు చెందిన స్వర్ణకారుడు ఏలూరి కామేశ్వరావు.. తక్కువ ధరకే బంగారం చేసిస్తానని గ్రామస్తులను నమ్మించాడు. దాదాపు 100 మంది బాధితుల నుంచి పాత బంగారం, నగదును వసూలు చేశాడు. బంగారం ఎప్పుడు ఇస్తావని గ్రామస్తులు అడుగగా.. సమాధానం దాటవేస్తూ వచ్చాడు. తాజాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారయ్యాడు. దీంతో మోస పోయామని గ్రహించిన బాధితులు యడ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రష్యాతో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న చర్చలు కీలక పురోగతి సాధించాయి. పలు కీలక అంశాల్లో వాటి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఒక్క ప్రాంతాల నియంత్రణతోపాటు జపోరిజియా అణు విద్యుత్తు ప్లాంటు నిర్వహణపైనే ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. తాము చాలా అంశాలకు అంగీకరించామని, ఇక రష్యా అధ్యక్షుడు బంతి పుతిన్ కోర్టులోనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. దీంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసే అవకాశాలకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు(BNP), మాజీ ప్రధాని ఖలీదా జియా ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ సమయంలో ఆమె కుమారుడు తారిక్ రహమాన్ స్వదేశానికి తిరిగివచ్చారు. స్వీయ బహిష్కరణలో ఉన్న ఆయన.. 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి బంగ్లాలో అడుగుపెట్టారు. ఇంతకాలం ఆయన లండన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడున్న మూడ్రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందన్నారు. దేశ రాజధానిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ కాలుష్యం వల్ల నాకు మూడ్రోజుల్లోనే ఎలర్జీ వచ్చింది. రవాణా రంగం వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంద’’న్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘‘ఇది ఎలాంటి జాతీయవాదం? శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజు భారత్ సూపర్ స్టార్లు శతకాలతో అదరగొట్టారు. ఏళ్ల నాటి రికార్డులు బద్ధలయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌పై టీనేజ్ సంచలనం సూర్యవంశీ (190), సిక్కిం జట్టుపై రోహిత్ శర్మ (155), ఆంధ్ర జట్టుపై విరాట్ కోహ్లీ, కర్ణాటకపై ఇషాన్ కిషన్ (125), ఝార్ఖండ్‌పై దేవదత్ పడిక్కల్ (147) తదితరులు శతకాలు చేశారు. ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌ల్లో కొన్నింటి వీడియోలను బీసీసీఐ అభిమానులతో పంచుకొంది.
తాను ఏ విషయంలోనైనా బాధ పడకుండా బలంగా ముందుకు సాగుతానని నటి అనసూయ అన్నారు. హీరోయిన్‌ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చే క్రమంలో అనసూయ పేరును ప్రస్తావించగా ఆమె వరుస పోస్ట్‌లతో స్పందించారు.