E-Paper
Advertisement

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. బయోపిక్ సినిమాకి శ్రీకారం!

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. బయోపిక్ సినిమాకి శ్రీకారం!
Advertisement

Malla Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నాయకులలో మల్లారెడ్డి ఒకరు. పాలమ్మినా, పూలమ్మిన అంటూ తన అద్భుతమైన స్పీచ్ తో, తన మేనరిజంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక మల్లారెడ్డి రాజకీయాలలో మాత్రమే కాకుండా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విద్యావేత్తగా రాజకీయ నాయకుడిగా మంచి ఆదరణను సొంతం చేసుకున్న మల్లారెడ్డి సినిమాలలోకి రాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి . మల్లారెడ్డికి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయనకు సినిమాలలో అవకాశాలు కూడా రావడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.

పవన్ సినిమాను రిజెక్ట్ చేసిన మల్లారెడ్డి..

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమాలో ఈయనకు విలన్ పాత్రలో అవకాశం రావడంతో విలన్ అంటే హీరో తన్నులు తినాల్సి ఉంటుంది అందుకే తాను ఈ సినిమా చేయలేదని మల్లారెడ్డి తెలిపారు. తాజాగా మల్లారెడ్డి ఒక కార్యక్రమంలో భాగంగా సినిమాలలోకి రావడం గురించి స్పందిస్తూ సినిమాలలోకి రావడం పై అభిప్రాయాలను తెలియజేశారు. తాను సినిమాలలోకి రావడం పక్కా అంటూ ఈయన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.

తన బయోపిక్ సినిమాకు నిర్మాతగా…

Advertisement

కచ్చితంగా తాను సినిమాలలోకి వస్తానని అయితే ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన బయోపిక్ (Biopic Movie)సినిమా చేయాలని కోరికగా ఉందని అయితే ఈ బయోపిక్ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తాను అంటూ మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా మల్లారెడ్డి తన బయోపిక్ సినిమాను ప్రకటించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మల్లారెడ్డి బయోపిక్ సినిమా ద్వారా హీరోగా ఎవరు ముందుకు వస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక సినిమాలలో నటించడం గురించి కూడా ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను సినిమాలలో ఏదైనా మంచి పాత్రలలో చేసే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపారు.

విలన్ పాత్రలు మాత్రం చెయ్యను..

Advertisement

సినిమాలలో విలన్ పాత్రలు కాకుండా ఇతర కీలక పాత్రలలో నటించడానికి తాను సిద్ధమే అంటూ మల్లారెడ్డి ఈ సందర్భంగా ఇండస్ట్రీలోకి రావడం గురించి  క్లారిటీ ఇచ్చారు .మరి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయనకు అనుగుణంగా ఉన్న పాత్రలను ఏ డైరెక్టర్ రాస్తారు ?ఈయన ఏ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల కాలంలో మల్లారెడ్డి కేవలం రాజకీయ వ్యవహారాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు అలాగే పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ మల్లారెడ్డి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ఓటీటీలోకి రాబోతున్న 220 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా ‘వాలా 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×