E-Paper
Advertisement

తొక్కలో ఇంటర్వ్యూ.. జాఫర్ పై ఫైర్ అయిన గెటప్ శ్రీను!

తొక్కలో ఇంటర్వ్యూ.. జాఫర్ పై ఫైర్ అయిన గెటప్ శ్రీను!
Advertisement

Getup Srinu: ప్రముఖ నటుడు గెటప్ శ్రీను (Getup Srinu) ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ మరింత పాపులారిటీ అందుకుంటున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవల ఈయన నటించిన చిత్రం రాకాస. ఈరోజు నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది. అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఈయన తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో జాఫర్ అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసిన గెటప్ శ్రీను.. ఆగ్రహంతో మైక్ విసిరేసి తొక్కలో ఇంటర్వ్యూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి అసలు ఏం జరిగింది అనే విషయం ఎప్పుడు చూద్దాం.

తొక్కలో ఇంటర్వ్యూ అంటూ మైక్ విసిరేసిన గెటప్ శ్రీను..

మహాదేవపట్నంలో జరిగిన ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూలో జర్నలిస్టు జాఫర్ గెటప్ శ్రీనుని ఇంటర్వ్యూ చేశారు.. మొదట ఈ ఇంటర్వ్యూ సరదాగా సాగినా.. కొద్దిసేపటికే ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్వ్యూ మధ్యలో కులం ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూ వేడెక్కింది. శ్రీను ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూ..” మేము కాపులం” అని వ్యాఖ్యానించారు. దానిపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలా మాట్లాడకూడదు అంటూ జాఫర్ అనడంతో పరిస్థితి విషమించి.. తీవ్ర ఆగ్రహానికి గురైన గెటప్ శ్రీను ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చెయ్యను అంటూ మైక్ విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

సోషల్ మీడియాలో మొదలైన చర్చ..

Advertisement

శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్ స్పందిస్తూ నేను తప్పుగా ఏమి అడిగాను? ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? అని ప్రశ్నించడం అక్కడి వారి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది . ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇది చూసిన నెటిజన్స్ అసలు వివాదానికి దారి తీసిన ఆ ప్రశ్న ఏంటి? సాఫీగా సాగుతున్న ఇంటర్వ్యూ అంత వేడెక్కడానికి గల కారణం ఏమిటి? జాఫర్ అడిగిన ప్రశ్నలు ఏంటి? ఎందుకు శ్రీను అంతలా ఫైర్ అయ్యారు? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో బయటకి వస్తే తప్ప అసలు నిజాలు కాస్త సస్పెన్స్ గానే ఉంటాయని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ ఘటనకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.

గెటప్ శ్రీను కెరియర్..

గెటప్ శీను విషయానికి వస్తే .. స్టాండ్ అప్ కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో భిన్నమైన గెటప్లతో గెటప్ శ్రీనుగా పేరు సంపాదించుకున్నారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన 1984 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా.. ఆకివీడు మండలం చినమిల్లిపాడు గ్రామ శివారులోని కాళింగపేటలో జన్మించారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాదు వచ్చిన ఈయన ఒకవైపు చదువుకుంటూనే.. మరొకవైపు సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే డిగ్రీ పూర్తయ్యాక 2014లో దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాతో నటుడిగా అవకాశం లభించి.. అలా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇప్పటివరకు సుమారుగా 60 కి పైగా చిత్రాలలో నటించారు.

Advertisement

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×