E-Paper
Advertisement

చిత్ర పరిశ్రమకే సిగ్గుచేటు..జననాయగన్ లీక్ పై మోహన్ బాబు ఫైర్!

చిత్ర పరిశ్రమకే సిగ్గుచేటు..జననాయగన్ లీక్ పై మోహన్ బాబు ఫైర్!
Advertisement

Mohan Babu: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సినిమాలలో బిజీగా గడుపుతున్న ఈయన సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారు కేవలం కీలకమైన అంశాల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నేడు తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ (Jananayagan)సినిమాకు సంబంధించి ఒక ఐదు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా సినిమాకు సంబంధించిన క్లిప్ బయటకు రావడంతో చిత్ర బృందం ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జననాయగన్ లీక్ మండిపడిన మోహన్ బాబు..

ఇకపోతే ఈ సినిమా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం పట్ల ఎంతోమంది తమిళ హీరోలు అలాగే టాలీవుడ్ హీరోలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి, శ్రీను వైట్ల వంటి తదితరులు ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) సైతం జననాయగన్ లీక్ అవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్ర పరిశ్రమకు జరిగిన అవమానం..

Advertisement

ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు తన అధికారిక ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “జననాయగన్ సినిమా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అనేది చిత్ర పరిశ్రమ మొత్తానికి జరిగిన అవమానం, సిగ్గుచేటైన ద్రోహం అని తెలిపారు. చట్ట విరుద్ధంగా ఈ సినిమా లీక్ అవ్వడం అనేది హృదయ విధారకం అంటూ మోహన్ బాబు మండిపడ్డారు. ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం వందలాదిమంది ఏడాది పాటు తమ తమ రక్తాన్ని చెమటను, కష్టాన్ని దార పోశారు. ఇలా సినిమాలను లీక్ చేసే నేరస్తుల వల్ల వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో సామూహిక కష్ట ఫలాలను నాశనం చేసే వారి పట్ల ఎలాంటి కనకరం చూపించకూడదు ఇలాంటి నేరస్తులను వెంటాడి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తూ మన సినిమాలను వాటిని తెరకెక్కించిన వారి గౌరవాన్ని కాపాడుదాం” అంటూ మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా ఒక సినిమా విడుదల కాకుండానే ఆ సినిమాకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంవత్సరాలు తరబడి నిద్రాహారాలు మాని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కంటే ముందుగానే లీక్ చేయడం అనేది ఇండస్ట్రీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలోనే పైరసీలకు అడ్డుకట్టు వేయడం కోసం నటీనటులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ పైరసీ మాత్రం ఆగడం లేదని చెప్పాలి.

Also Read: AAFA ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ డ్రైవ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×