Dimple hayathi (Image Credit: Instagram)
ప్రముఖ సినీనటి డింపుల్ హయతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Dimple hayathi (Image Credit: Instagram)
ఆ తర్వాత గద్దల కొండ గణేష్ చిత్రంలో జర్ర జర్ర అనే సాంగ్ తో అటు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక మధ్యలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన డింపుల్ హయతి ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Dimple hayathi (Image Credit: Instagram)
ఇందులో మళ్లీ రవితేజ సరసన నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది.

Dimple hayathi (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా గ్రేప్ కలర్ డ్రెస్ ధరించి అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మైమరిపించే ప్రయత్నం చేసింది.

Dimple hayathi (Image Credit: Instagram)
టాప్ అందాలతో సెగలు పుట్టిస్తూ గ్లామర్ కే సరికొత్త నిర్వచనం చూపించిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి ఇలా గ్లామర్ తో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం డింపుల్ హయతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dimple hayathi (Image Credit: Instagram)
ప్రస్తుతం భోగి సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నైనా మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.