E-Paper
Advertisement

Mohan babu: డైలాగ్ కింగ్ @ 74 – ది లెజెండ్ ఆఫ్ మోహన్ బాబు

Mohan babu: డైలాగ్ కింగ్ @ 74 – ది లెజెండ్ ఆఫ్ మోహన్ బాబు

Mohan babu: తెలుగు తెరపై ఆ గళం వినబడితే థియేటర్లో వైబ్రేషన్స్ఆ. నడక కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ. డైలాగ్ డెలివరీలో ఆయనో డిక్షనరీ.. క్రమశిక్షణలో ఆయనో హిస్టరీ. ఆయనే నటప్రపూర్ణ, డాక్టర్ మంచు మోహన్ బాబు. నేడు ఈ ‘పెదరాయుడు’ 74వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సున్నా నుండి శిఖరానికి చేరిన ఆయన క్రేజీ సినీ జర్నీపై ‘బిగ్ సినిమా’ స్పెషల్

భక్తవత్సలం నాయుడు to మోహన్ బాబు
చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మర్చి 19న ఒక స్కూల్ టీచర్ కొడుకుగా పుట్టిన మంచు భక్తవత్సలం నాయుడు, నిజ జీవితంలోనూ పీఈటీ మాస్టారుగా పనిచేశారు. కానీ, లోపల ఉన్న నటుడు ఊరుకోలేదు. మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ, స్టూడియోల చుట్టూ తిరగడం.. అబ్బో ఆ కష్టం మామూలుది కాదు.గురువు దాసరి నారాయణరావు గారు ‘స్వర్గం-నరకం’లో అవకాశం ఇచ్చి ‘మోహన్ బాబు’ అని పేరు మార్చారు. అంతే.. అక్కడ మొదలైన మంచు ప్రభంజనం ఇప్పటికీ ఆగేదేలే అనిపిస్తోంది!

విలనిజంలో ‘మాస్’ మేజిక్.. కామెడీలో ‘క్లాస్’ లాజిక్
‘పప్పారాయుడు.. పప్పారాయుడు..’ అని ఆయన విలనిజం పండిస్తుంటే జనం విజిల్స్ వేశారు. ఒక రకంగా తెలుగు తెరపై ‘కామెడీ విలన్’ అనే కాన్సెప్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండ్స్‌తో తలపడుతూనే తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు ఆయన.

ఇండస్ట్రీ హిట్ల ‘మొగుడు’.. కలెక్షన్ల ‘రౌడీ’!
హీరోగా ‘అల్లుడుగారు’తో మొదలైన సెకండ్ ఇన్నింగ్స్ ఒక రేంజ్ బాక్సాఫీస్ తాండవం. రజనీకాంత్ గెస్ట్ రోల్, మోహన్ బాబు విశ్వరూపం.. వెరసి ‘పెదరాయుడు’ ఇండస్ట్రీని షేక్ చేసింది. 10 లక్షల మంది సాక్షిగా జరిగిన ఆ వేడుక ఇప్పటికీ ఒక అన్-బీటబుల్ రికార్డ్!
ఇక ఒక నటుడు ఏకంగా 75 సినిమాలు నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ రికార్డ్!

గురుభక్తి.. రాజకీయ శక్తి.. విద్యా విప్లవం!
తన గురువు ఎన్టీఆర్ కోసం ‘మేజర్ చంద్రకాంత్’ తీసి బాక్సాఫీస్ వద్ద జెండా పాతారు. అటు రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లో గళం వినిపిస్తూ, ఇటు ‘శ్రీ విద్యానికేతన్’ (నేడు మోహన్ బాబు యూనివర్సిటీ) ద్వారా వేలాది మందికి విద్యనందిస్తూ నిజమైన సోషల్ హీరో అనిపించుకున్నారు కూడా . ఇక తన సంపాదనలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు.

అవార్డులు… గౌరవాలు…
1995లో ‘పెదరాయుడు’లో ప్రదర్శించిన నటనకుగాను ఫిలిం ఫేర్‌ సౌత్‌ ఉత్తమ నటుడి అవార్డుతో సన్మానించింది.
2008లో ‘యమదొంగ’ సినిమాలో నటనకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా సినిమా అవార్డు దక్కింది.
2016లో ఫిలింఫేర్‌ సౌత్‌ మోహన్‌బాబును జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది.
2017లో సైమా స్పెషల్‌ అప్రిషియేషన్‌ అవార్డును మోహన్‌బాబు అందుకున్నారు.
టీఎస్సార్‌ కళాపరిషత్‌ ‘నట వాచస్పతి’ అవార్డుతో మోహన్​బాబును సత్కరించింది.
2018 జనవరిలో టీఎస్సార్‌ కాకతీయ కళాపీఠం ‘విశ్వనట సార్వభౌమ’ పురస్కారాన్ని మోహన్‌బాబు అందుకున్నారు.
2017 అక్టోబర్‌ 5న చెన్నైలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఇక పద్మశ్రీ,ఫిల్మ్‌ఫేర్,లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్…అన్నీ ఆయన ప్రతిభకు వచ్చిన గుర్తింపులు మాత్రమే.

ఇప్పటికీ అదే జోరు… అదే ఫైర్!
వయసు కేవలం నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’ సినిమాలతో నేటి తరాన్ని ఊపేయడానికి రెడీ అయిపోయారు మన కలెక్షన్ కింగ్.
డైలాగ్ అంటే గర్జన…నటన అంటే నిప్పు…పాత్ర అంటే ప్రాణం
ఈ మూడు కలిస్తే అది ఒకే ఒక్క వ్యక్తి.
మోహన్ బాబు అంటే ఒక నటుడు కాదు… ఒక శకం!
హ్యాపీ బర్త్‌డే డైలాగ్ కింగ్.

also read:రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్ 2’లో ఆదిత్యధర్ మ్యాజిక్ పనిచేసిందా?.. ఫుల్ రివ్యూ..

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×