E-Paper
Advertisement

Michael Vaughan: ధోని ఏమైనా ప్ర‌ధానినా ? ఇంత సెక్యూరిటీ, బిల్డ‌ప్ ఎందుకు..మైఖేల్ వాన్ సంచ‌ల‌నం

Michael Vaughan: ధోని ఏమైనా ప్ర‌ధానినా ? ఇంత సెక్యూరిటీ, బిల్డ‌ప్ ఎందుకు..మైఖేల్ వాన్ సంచ‌ల‌నం
Advertisement

Michael Vaughan: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో ఏ మూలకు వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానులు ఉంటారు. ఆయన పేరు చెప్పగానే ఎగిరి గంతేస్తారు ధోని అభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ ఆవగింజంత కూడా తగ్గడం లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడిగా ధోనీకి మంచి పేరు ఉంది. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీకి మోడీ సర్కార్ కూడా సముచితమైన గౌరవం ఇస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ధోనీకి సెక్యూరిటీ ఉండడం పైన తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ( Michael Vaughan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఏమైనా ఇండియా ప్రధానియా ? ఇంకా ఏమైనా పెద్ద పదవిలో ఉన్నాడా ? ఇంతలా సెక్యూరిటీ ఎందుకు? అంత పొగరెందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మైఖేల్ వాన్. దీంతో మహేంద్ర సింగ్ ధోనీపై మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

ధోని ఏమైనా ప్ర‌ధానినా ? ఇంత సెక్యూరిటీ, బిల్డ‌ప్ ఎందుకు

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు మైఖేల్ వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో మహేంద్రసింగ్ ధోనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే.. కానీ ఇంతలా సెక్యూరిటీ ఇచ్చి ఓవర్ గా అతని పట్ల బిహేవ్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు మైఖేల్ వాన్. ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా మహేంద్రసింగ్ ధోని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాడని తెలిపారు. ఐసీసీ టోర్నమెంట్ లలో భాగంగా టీమిండియా మ్యాచ్ ల‌కు కూడా ధోని హాజరవుతాడు.. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చిన రేంజ్ లో మహేంద్రసింగ్ ధోనీకి సెక్యూరిటీ ఇస్తారని పేర్కొన్నారు.

అతన్ని హీరోలా చూస్తారని వివరించారు. అయితే ఓ మాజీ క్రికెటర్ ను దేశ ప్రధాని లాగా ట్రీట్ చేయడం ఎందుకు ? అని చురకలు అంటించారు మైఖేల్ వాన్. తమ ఇంగ్లాండ్ లో మాత్రం మహేంద్రసింగ్ ధోని లాగా ఘనతలు, రికార్డులు సాధించిన వాళ్లను పట్టించుకోరని గుర్తు చేశారు. కానీ ధోనిని మాత్రం ఇండియాలో ఓ హీరోలాగా ట్రీట్ చేస్తున్నానని తెలిపారు. ఇక మహేంద్రసింగ్ ధోని సాధించిన రికార్డులు తక్కువేం కాదని పొగిడారు. అతడు ఆల్ టైం గ్రేట్ కెప్టెన్ అని వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా అద్భుతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అని ప్రశంసించారు. ఓవ‌రాల్ గా ధోనిని పొగుడుతూనే, ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేశాడు మైఖేల్ వాన్. ఇక మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ధోని ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×