E-Paper
Advertisement

Mohan Babu: ది ప్యారడైజ్ కోసం కళ్ళు చెదిరే రేంజ్ లో మోహన్ బాబు రెమ్యూనరేషన్.. అంత అవసరమా?

Mohan Babu: ది ప్యారడైజ్ కోసం కళ్ళు చెదిరే రేంజ్ లో మోహన్ బాబు రెమ్యూనరేషన్.. అంత అవసరమా?
Advertisement

Mohan Babu : టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఈయన ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మోహన్ బాబు(Mohan Babu) అంటే కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఈయన విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే నాని సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

భారీగా మోహన్ బాబు రెమ్యూనరేషన్..

ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా ప్రేక్షకుల పొందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మే లేదా జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

రూ. 5 కోట్లు అవసరమా?

Advertisement

ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఈయన చేతిలో గన్నోటిలో సిగరెట్ తో పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇలా ఈ సినిమాలో విలన్ గా నటించడం కోసం మోహన్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం మోహన్ బాబు ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. మోహన్ బాబు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారనే విషయం తెలిసి పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

8 భాషలలో ది ప్యారడైజ్..

Advertisement

ఇలా ఒక సినిమాలో ఒక పాత్ర కోసం మోహన్ బాబు ఐదు కోట్లు తీసుకోవడం అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రస్తుత మోహన్ బాబుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు తనికెళ్ళ భరణి, సంపూర్ణేష్ బాబు వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక నానికి జోడిగా ఖాయాదు లోహర్ ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు అలాగే సీనియర్ నటి సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ ఎల్ వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పాత్ర విభిన్న రీతిలో ఉండబోతుందని రెండు జడలతో ఈయన మాస్ లుక్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Ajith Kumar -Anil Sunkara: అనిల్ సుంకర నిర్మాణంలో అజిత్ కుమార్.. రంగంలోకి క్రేజీ డైరెక్టర్?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×