Ajith Kumar -Anil Sunkara: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara)ఒకరు ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. ఇటీవల కాలంలో చిన్న అనిల్ సుంకర శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో అనిల్ సుంకర తిరిగి సినిమాల పరంగా చాలా యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలోని ఈయన భారీ బడ్జెట్ సినిమాలను కూడా చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం అనిల్ సుంకర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేసేలాగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అనిల్ సుంకర హీరో అజిత్ కోసం పవర్ ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేయించారని తెలుస్తోంది. గతంలో అజిత్ నటించిన వేదాళం వంటి యాక్షన్ సినిమా తరహాలో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో అనిల్ సుంకర ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు అజిత్ AK 64 సినిమా అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అధికారక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక అనిల్ సుంకర అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నారు. Ak 64 సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ..
ఇక అనిల్ సుంకర అజిత్ తో చేయబోయే సినిమా ఇదేనా? లేకపోతే మరో కొత్త సినిమాను ప్రకటించబోతున్నారా? అనే సందేహాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. నారి నారి నడుమ మురారి మంచి సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్- బెజవాడ బ్యాచ్ వంటి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక అజిత్ కుమార్ చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Also Read: Shambala OTT: ఓటీటీలోనూ తగ్గని ఆది శంభాల క్రేజ్… ఆహాలో సరికొత్త రికార్డు !