E-Paper
Advertisement

KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై కన్నేసీన కేసీఆర్.. మున్సి పోల్‌లో దెబ్బ‌కొట్టేందుకు వ్యూహం ఇదే..?

KCR: క‌డియంపై ముప్పేట దాడి
-గులాబీ టార్గెట్ ఘ‌న్‌పూర్ పీఠం
-చ‌క్రం తిప్పుతున్న‌ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి
స్వేచ్ఛ‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ హాట్‌గా మున్సిఫ‌ల్ ఎన్నిక‌లు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మున్సిపాలిటి ఎన్నిక‌లు జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో సాగ‌బోతున్నాయి. అందుకు కార‌ణం ఈ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి(Kadiyam Srihari) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మున్సిపాలిటి కావ‌డ‌మే. ఈ మున్సిపాలిటిపై ప్ర‌త్యేక దృష్టిని సారించారు మాజీ సీఎం కేసీఆర్‌(KCR). క‌డియం శ్రీ‌హ‌రిని ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మున్సిపాలిటిలో ఓడించి దెబ్బ‌కొట్టాల‌నే ఆలోచ‌నే అనేది రాజ‌కీయ ప‌రిశీల‌కుల అభిప్రాయం. బీఆర్‌ఎస్‌లో గెలిచి, కాంగ్రెస్‌లో క‌డియం శ్రీ‌హ‌రి చేర‌డంతో కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎంతో విద్యావంతుడైన క‌డియం శ్రీ‌హ‌రి బీఆర్‌ఎస్‌లో గెలిచి ఇలా పార్టీ ఫిరాయించడం, గెలిపించిన పార్టీకి ద్రోహం చేయ‌డ‌మే కాకుండా ఆపై కేసీఆర్‌ను, ఆయ‌న కుటుంబాన్ని, పార్టీని దూషించ‌డంతో కేసీఆర్ మ‌న‌స్థాపానికి గురై, ఎలాగైనా క‌డియం శ్రీ‌హ‌రిపై ప్ర‌తికారం తీర్చుకోవాల‌నే సంక‌ల్పంతో కేసీఆర్ ఉన్న‌ట్లు బీ ఆర్‌ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. అదే క్ర‌మంలో కేసీఆర్ స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మున్సిపాలిటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నార‌ని, అందులో భాగంగానే ఇక్కడ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల‌ను ఇన్‌చార్జ్‌లుగా నియ‌మించార‌ని తెలిసింది. ఇప్పుడు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో మున్సిఫ‌ల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.

కేసీఆర్ దూత‌గా పోచంప‌ల్లి

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఇప్పుడు అంతా ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి(Srnivas Reddy) చ‌క్రం తిప్పుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌(KTR)కు ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడిగా పేరుంది. కేసీఆర్, కేటీఆర్ లు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డికి స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో బీఆర్‌ఎస్ గెలుపే ల‌క్ష్యంగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి కేసీఆర్ ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక ద‌గ్గ‌ర నుంచి మొద‌లు గెలిచే వర‌కు బాధ్య‌త తీసుకుని ముందుకు పోతున్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో గెలిచే అవ‌కాశం ఉన్న అభ్య‌ర్థులు ఎవ్వ‌రు, వారి ప‌రప‌తి ఏమిటీ, ఆర్ధిక వ‌న‌రులు ఏమిటీ, అంగ‌బ‌లం ఏమిటీ, బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు ఏమిటీ అనేది అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయించారు. స‌ర్వేల‌ను అస‌రా చేసుకునే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తున్నారు. ఘ‌న్‌పూర్ మున్సిపాలిటీలో ఉన్న 18వార్డుల్లో మెజారిటీ స్థానాలు గెలిచి చైర్మ‌న్ పీఠ‌మే ల‌క్ష్యంగా పావులు కదుపుతున్నారు ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి.

Also Read: Night Shift: రాత్రి షిఫ్ట్ పని చేసే వారికి ఆ భయంకర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ?

ముందుండి న‌డుపుతున్న ముగ్గురు

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మున్సిపాలిటిలో గులాబీ జెండాను ఎగుర‌వేసేందుకు గులాబీ ద‌ళం ముగ్గురుతో ముందుకు సాగుతున్నారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి ఇన్‌చార్జీగా మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డిలు ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి రాజ‌కీయ చ‌తురత ముందు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య(Tatikonda Rajayya) రాజ‌కీయ చ‌తుర‌త కొర‌గానిద‌ని గ్ర‌హించిన పార్టీ అధిష్టానం ముగ్గురు నేత‌లకు బాధ్య‌త‌లు అప్ప‌గించిందని ప్ర‌చారం. క‌డియం శ్రీ‌హ‌రి ఎత్తుల‌ను, జిత్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ రాజ‌య్య‌ను ప‌ట్టించుకోకుండా, పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు బీ ఆర్ ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ మ‌రొక అద‌న‌పు బ‌లంగా మారాడు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్తుల‌కు కొంత ఆర్ధిక సాయం చేసేందుకు అరూరి ర‌మేష్ ముందుకు వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

సింగిల్‌గానే క‌డియం వ్యూహం

బీ ఆర్ ఎస్ పార్టీ త్రిమూర్తుల‌తో పార్టీ అభ్య‌ర్థుల గెలుపుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తుండ‌గా కాంగ్రెస్ అభ్య‌ర్తుల గెలుపుకు ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సింగిల్‌గానే ముందుకు సాగుతున్నారు. పార్టీని న‌మ్ముకుని ఉన్న‌వారు ఎవ్వ‌రు, అర్ధ‌బ‌లం, అంగ‌బ‌లం, స‌మాజంలో పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న‌వారు ఎవ్వ‌రు అనేది గీటురాయిగా తీసుకుని, గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇచ్చే కార్య‌క్ర‌మానికి క‌డియం శ్రీ‌హ‌రి పూనుకున్నారు. క‌డియం శ్రీ‌హ‌రిని ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు సాగుతున్న త‌రుణంలో వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ కాంగ్రెస్ జెండాను స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో ఎగురేయాల‌నే ఆలోచ‌న‌తో క‌డియం ఉన్నారు. బీ ఆర్ ఎస్ నేత‌ల ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టేందుకు క‌డియం శ్రీ‌హ‌రి సింగిల్‌గానే ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. క‌డియం శ్రీ‌హ‌రి త‌న వెంట ఉన్న‌వారినే ఎంపిక చేయ‌కుండా, పార్టీ కోసం ప‌నిచేసి, గెలిచే స‌త్తా ఉన్న‌వారినే ఎంపిక చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో గెలుపే ల‌క్ష్యంగా ఎత్తులు వేస్తున్న కేసీఆర్ ని గెలుపు వ‌రిస్తుందా, ఎంతో రాజ‌కీయ అనుభ‌వం, చ‌తుర‌త ఉన్న క‌డియం శ్రీ‌హ‌రి ని వ‌రిస్తుందా అనేది ఈనెల 13న తేల‌నున్న‌ది. ఈపోరు ఇప్పుడు కేసీఆర్‌, క‌డియందిగా మారిందనుట‌లో సందేహం లేదు.

Also Read: Ambati Arrest: ఇదేనా మీ రూల్ ఆఫ్ లా? వాళ్ల పేర్లు చెబుతూ.. మండిపడ్డ రోజా

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×