E-Paper
Advertisement

Mohan Babu: పండగ రోజు తూలుతున్న మోహన్ బాబు… మందు కొట్టాడా అంటూ ట్రోల్స్

Mohan Babu: పండగ రోజు తూలుతున్న మోహన్ బాబు… మందు కొట్టాడా అంటూ ట్రోల్స్
Advertisement

Mohan Babu:  సోషల్ మీడియాలో ఈ మధ్య చిన్న వీడియోలు కూడా పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో వల్ల సీనియర్ నటుడు మోహన్ బాబు.. మరోసారి వార్తల్లో నిలిచారు. సంక్రాంతి వేడుకల సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన మోహన్ బాబు.. ఇటీవల సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

Advertisement

గత కొంతకాలంగా మంచు కుటుంబం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య జరిగిన విభేదాలు పెద్ద చర్చగా మారాయి. ఆ సమయంలో మోహన్ బాబు మీడియాపై అసహనం వ్యక్తం చేయడం కూడా అప్పట్లో వార్తలకెక్కింది. ఇప్పుడు మరోసారి మోహన్ బాబు పేరు వైరల్ వీడియోతో వార్తల్లోకి వచ్చింది. సంక్రాంతి వేడుకల సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. సినిమాల గురించి ప్రశ్నించగా, “ఇప్పుడు సినిమాలపై మాట్లాడడానికి రాలేదు” అంటూ సూటిగా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆయన సాధారణంగానే మాట్లాడినట్టు కనిపించారు.

?utm_source=ig_web_copy_link

Advertisement

కానీ అదే రోజు తీసిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మోహన్ బాబు నిలబడుతూ కొంచెం తూలుతున్నట్టు.. ఆ తరువాత కొన్ని సార్లు కింద పడిపోతున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలామంది “ఫుల్‌గా తాగేసి వచ్చారా?” అంటూ మోహన్ బాబు పై కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇప్పుడు మీది అని వెళ్లి ఆయన క్వశ్చన్స్ అడగమనండి అంటూ వెతకారంగా కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద చర్చకు దారి తీస్తోంది. కొందరు అభిమానులు మాత్రం మోహన్ బాబును సమర్థిస్తూ, వీడియోను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెబుతున్నారు.

ALSO READ:Chiru 158: చిరంజీవి – బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్.. పూజా కార్యక్రమం ఎప్పుడంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×