E-Paper
Advertisement

Toxic Relationship: మీరు ఉన్నది నిజమైన ప్రేమలోనేనా? ఈ 6 సంకేతాలు కనిపిస్తే అది ప్రేమ కాదు.. టాక్సిక్ రిలేషన్‌షిప్!

Toxic Relationship: మీరు ఉన్నది నిజమైన ప్రేమలోనేనా? ఈ 6 సంకేతాలు కనిపిస్తే అది ప్రేమ కాదు.. టాక్సిక్ రిలేషన్‌షిప్!
Advertisement

Toxic Relationship: ప్రేమ అనేది రెండు మనసుల మధ్య ఉండే ఒక అందమైన వంతెన. ఈ మధురమైన అనుభూతి మనల్ని ఉత్సాహంగా, సంతోషంగా ఉంచాలి. అలాగే పరస్పర గౌరవం, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉన్నప్పుడే ఆ బంధం చిరకాలం నిలుస్తుంది. అయితే, నేటి కాలంలో చాలామంది ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతున్నారు.

ఏదో ఒక బలమైన ఎమోషన్ కలగగానే దానిని ప్రేమేమో అని భ్రమపడటం వల్ల కాలక్రమేణా మానసిక ప్రశాంతతను కోల్పోతుంటారు. దీంతో ప్రేమ అనుకుంటున్న బంధం మానసికంగా కుంగదీస్తుంటుంది. దానినే ‘టాక్సిక్ రిలేషన్‌షిప్’ అంటారు. మీరు ఉన్నది నిజమైన ప్రేమలోనేనా లేక విషపూరిత బంధంలోనా అని తెలుసుకోవడానికి ఈ 6 సంకేతాలు సహాయపడతాయి.

1) అతిగా నియంత్రించడం

Advertisement

నిజమైన ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. కానీ మీ భాగస్వామి మీరు ఎక్కడికి వెళ్లాలి? ఎవరితో మాట్లాడాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా వారే నిర్ణయిస్తుంటే.. అది ప్రేమ కాదు, ఆధిపత్యం. మీ వ్యక్తిగత నిర్ణయాల్లో గౌరవం లేకపోవడం టాక్సిక్ బంధానికి ప్రధాన లక్షణం.

Also Read: డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. వారంలో రెండుసార్లు తలకాయ కూర తింటే జరిగేది ఇదే!

2) ఎక్కువ విమర్శించడం

Advertisement

మీరు ఏం చేసినా తప్పులు వెతకడం, ఇతరుల ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం ప్రేమనిపించుకోదు. మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది పోయి.. ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే ఆ బంధం ద్వారా మీరెంత బాధపడుతున్నారో గ్రహించాలి.

3) పదే పదే అనుమానించడం

ప్రేమకు పునాది నమ్మకం. పదే పదే మీ స్మార్ట్‌ఫోన్ చెక్ చేయడం, ప్రతి చిన్న విషయానికి ఆధారాలు అడగటం, స్నేహితులతో మాట్లాడితే అసూయ పడటం వంటివి ఉంటే ఆ బంధంలో నమ్మకం లేదని అర్థం. అనుమానం ఉన్న చోట అనురాగం నిలవదు.

4) గ్యాస్ లైటింగ్

ఇది చాలా ప్రమాదకరమైనది. మీరు చెప్పేది అబద్ధమని, మీ ఆలోచనలే తప్పని మిమ్మల్ని నమ్మించడం. చివరకు తప్పు మీదేనని మీరు ఒప్పుకునేలా మానసిక ఒత్తిడికి గురిచేయడం. దీనివల్ల మీరు మీ సొంత నిర్ణయాల మీద నమ్మకాన్ని కోల్పోతారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో మాత్రం అస్సలు ఉండకూడదు.

5) ఎమోష్నల్ బ్లాక్ మెయిలింగ్

‘నువ్వు నా మాట వినకపోతే నేను చచ్చిపోతాను’ అనడం లేదా చిన్న విషయానికే మాట్లాడటం మానేయడం, కాల్స్ చేయడకుండా బ్లాక్ చేయడం వంటివి మిమ్మల్ని శిక్షంచడం కిందకే వస్తుంది. ఇలా ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఆరోగ్యకరమైన బంధం కాదు.

6) మీ ఎదుగుదలను ఓర్వలేకపోవడం

మీరు కెరీర్‌లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవడం. నువ్వేం పెద్దగా సాధించలేదు.. నీకేం తెలియదు వంటి మాటలు మీ పార్ట్‌నర్ నుంచి వింటుంటే మాత్రం ఆ బంధాన్ని టాక్సిక్ రిలేషన్‌షిప్‌గానే భావించాలి. ఎందుకంటే.. నిజమైన భాగస్వామి మీ విజయాలను చూసి గర్వపడతారు. ఏ బంధమైనా సంతోషాన్ని ఇవ్వాలి కానీ మానసిక వేదనను కాదు.

Also Read: వీలైతే ఈ పండును రోజూ తినండి.. ఎంతటి మొండి వ్యాధులైనా పారిపోవాల్సిందే!

 

 

 

 

 

Related News

సోషల్ మీడియాలో ఏళ్ల తరబడి ఒకే ప్రొఫైల్ ఫొటో పెట్టేవారు చాలా స్పెషల్.. సైకాలజీ ఏం చెబుతోందంటే?

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

Big Stories

Advertisement
×