E-Paper
Advertisement

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం

Ramdev Rao: లీజు పేరుతో భూకబ్జా? ఎకో పార్క్ యజమాని రాందేవ్ రావు తీరుపై రైతుల పోరాటం
Advertisement

Ramdev Rao: రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ పరిధిలోని ఎక్స్ పీరియమ్ ఎకో పార్క్ (Experium Eco Park) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. ఈ పార్క్ యజమాని రాందేవ్ రావు తమను మోసం చేశారంటూ స్థానిక రైతులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఐదేళ్ల కాల పరిమితికి అని నమ్మబలికి, అక్రమంగా 99 సంవత్సరాల పాటు భూమిని లీజుకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ జీవితాధారమైన భూమిని లాక్కున్నారని వారు వాపోతున్నారు.

రైతుల కథనం ప్రకారం.. మొదట్లో పార్క్ అభివృద్ధి కోసం భూమిని అడిగినప్పుడు, స్వల్ప కాలానికి మాత్రమే ఒప్పందం అని చెప్పారు. కానీ, తీరా ఒప్పంద పత్రాలను పరిశీలిస్తే అవి 99 ఏళ్ల లీజుకు మార్చబడ్డాయని రైతులు గుర్తించారు. దీనిపై ప్రశ్నించిన రైతులకు లీజు పత్రాలు చూపించకపోగా, రావలసిన నగదును కూడా చెల్లించకుండా రాందేవ్ రావు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుకుబడితో తమ నోరు నొక్కేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Advertisement

ఈ భూ వివాదం వల్ల తమకు జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ భూములను తమకు ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూమిని ఇలా మోసపూరితంగా లాక్కోవడం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు హెచ్చరిస్తున్నారు. తమ గోడును పట్టించుకోకపోతే, అందరం కలిసి రాందేవ్ రావు పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రకటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక వ్యాపారవేత్త స్వలాభం కోసం వందలాది ఎకరాల రైతు భూములను ఇలా ఇబ్బందుల్లోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Also Read: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 85 మంది

ప్రస్తుతానికి ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ భూ లీజు ఒప్పందాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, మోసపోయిన రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×