E-Paper
Advertisement

Mohan Babu: ‘ది ప్యారడైజ్’ నుంచి మెహన్ బాబు మేకోవర్ వీడియో చూశారా.. ఇది ఊర మాస్..

Mohan Babu: ‘ది ప్యారడైజ్’ నుంచి మెహన్ బాబు మేకోవర్ వీడియో చూశారా.. ఇది ఊర మాస్..
Advertisement

Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ‘కలెక్షన్ కింగ్’ మంచు మోహన్ బాబు, సుదీర్ఘ విరామం తర్వాత ఒక పవర్ ఫుల్ నెగటివ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ద పారడైజ్’. ఈ రోజు మోహన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది.

Read also-Aadi Saikumar Ego Raja: ఆది సాయికుమార్ మాస్ లుక్ ఇరగదీశాడుగా.. ‘ఇగో రాజా’ అంటూ..

32 ఏళ్ల తర్వాత

Advertisement

ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మోహన్ బాబు దాదాపు 32 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తుండటం. గతంలో ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’ వంటి చిత్రాల్లో గంభీరమైన పాత్రలు పోషించిన ఆయన, ఇందులో ‘శిఖంజా మాలిక్’ (Shikanja Maalik) అనే క్రూరమైన శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. “32 ఏళ్ల తర్వాత మళ్ళీ విలన్ గెటప్ వేస్తున్నాను” అని ఆయన స్వయంగా చెప్పడం అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. గ్లింప్స్‌లో చూపించిన మేకింగ్ విజువల్స్ సినిమా ఎంత భారీ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తున్నాయి. మోహన్ బాబు గారి విగ్, గడ్డం, ఆయన వేసుకున్న నగలు ఒక పాత కాలపు డాన్ లేదా ఒక ప్రాంతాన్ని శాసించే వ్యక్తిని తలపిస్తున్నాయి. ఒంటిపై గాయాలు, రక్తపు మరకలతో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని సిగార్ కాలుస్తూ ఆయన ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది.

Read also-Dhurandhar 2: రిలీజ్ రోజే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇది ఊచకోతే..

సాంకేతిక హంగులు

Advertisement

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రస్టిక్ శైలిని ఈ గ్లింప్స్‌లోనూ కొనసాగించారు. దీనికి తోడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం వీడియోకు ప్రాణం పోసింది. ఎస్.ఎల్.వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ కు మోహన్ బాబు గారి నటన తోడవ్వడంతో ‘ద పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×