E-Paper
Advertisement

Dhurandhar 2: రిలీజ్ రోజే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇది ఊచకోతే..

Dhurandhar 2: రిలీజ్ రోజే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇది ఊచకోతే..
Advertisement

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం థియేటర్లలోనే కాకుండా, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్‌మైషో (BookMyShow)లో కళ్లు చెదిరే రికార్డులను తిరగరాస్తూ సరికొత్త చరిత్రను లిఖించింది. సినిమా విడుదలైన మొదటి రోజే భారతీయ చిత్ర పరిశ్రమలో అంతకుముందున్న అతిపెద్ద రికార్డులన్నీ ఈ సినిమా ధాటికి కొట్టుకుపోయాయి.

Read also-Mohan babu: డైలాగ్ కింగ్ @ 74 – ది లెజెండ్ ఆఫ్ మోహన్ బాబు

పుష్ప 2 రికార్డు బద్దలు

Advertisement

ఇప్పటివరకు బుక్‌మైషోలో ఒక గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప 2’ (107.65K) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ధురంధర్ 2 పీక్ అవర్‌లో లక్షా పది వేలకు పైగా టికెట్లు విక్రయించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన క్షణం నుంచే ప్రేక్షకులు టికెట్ల కోసం పోటీ పడటంతో సర్వర్లు సైతం ఒత్తిడికి గురయ్యాయంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా గంటకు 108 k టికెట్లు బుకై రికార్డ్ క్రియేట్ చేసింది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ప్రభంజనం

కేవలం పీక్ అవర్ సేల్స్ మాత్రమే కాకుండా, మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో నిలిచింది. ఇప్పటివరకు బుక్‌మైషోలో ఈ సినిమా సుమారు 2.41 మిలియన్ల (24 లక్షల పైచిలుకు) టికెట్లను విక్రయించింది. హిందీ చిత్ర పరిశ్రమలో 2 మిలియన్ మార్కును దాటిన తొలి చిత్రంగా రణవీర్ సింగ్ ఖాతాలో ఈ ఘనత చేరింది. సౌత్ సినిమాలైన పుష్ప 2, కూలీ వంటి భారీ చిత్రాల సరసన ఇప్పుడు ధురంధర్ 2 కూడా చేరిపోయింది.

Advertisement

Read also-Ustaad Bhagat Singh Review: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే..

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మార్చి 18న జరిగిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమా దాదాపు రూ.44 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లు వసూలు చేయగా, ఈ సీక్వెల్ అంతకు మించిన వసూళ్లను రాబట్టే దిశగా దూసుకుపోతోంది. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ప్రీమియర్లు రద్దు అయినప్పటికీ, నేడు (మార్చి 19) విడుదలైన రెగ్యులర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ధురంధర్ 2 నిలవడం ఖాయమని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×