E-Paper
Advertisement

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం!

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం!
Advertisement

Film industry: చిత్ర సీమలో ఈరోజు ఏకంగా రెండు రోడ్డు ప్రమాదాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈరోజు ఉదయం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ నిమిత్తం బయలుదేరిన ప్రొడక్షన్ వెహికల్ రోడ్డు ప్రమాదానికి గురవగా.. అందులో 6 మంది ప్రయాణించగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం 5 మందికి గాయాలవడంతో వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటన మరువకముందే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.

ఇండస్ట్రీలో మరో రోడ్డు ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి

మలయాళ ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ (65) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనలో ఆయన భార్య రాజ్యలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడగా.. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరణ వార్తతో అటు సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దుఃఖానికి లోనవుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

Advertisement

ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయానికి వస్తే.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎనాత్ సమీపంలో చోటుచేసుకుంది. సంతోష్ నాయర్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరినీ సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో సంతోష్ నాయర్ కి గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి మరింత విషమించి చివరికి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతూ చికిత్స తీసుకుంటుంది.

సంతోష్ నాయర్ సినిమా కెరియర్..

1982లో సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈయన సుమారుగా 100కి పైగా చిత్రాలలో నటిస్తూ.. హీరోగా, విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆఖరికి కమెడియన్ గా కూడా నటించి విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. బుల్లితెరపై కూడా సత్తా చాటారు.
ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన మోహిని యాట్టం సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా అలరించింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని , ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు అని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , ఆయన భార్య త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.

Advertisement

also read:ఒక్క ఫోటో.. చరిత్ర తిరగరాసిన కుర్రోడు.. సంచలన పోస్ట్ షేర్ చేసిన వర్మ!

సంతోష్ నాయర్ వ్యక్తిగత జీవితం:

సంతోష్ నాయర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయన తండ్రి సీ.ఎన్.కేశవన్ నాయర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కాగా, తల్లి పి రాజ్యలక్ష్మి రిటైర్డ్ టీచర్.చిన్నతనంలోనే తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లడంతో తాత నానమ్మ దగ్గర పెరిగారు సంతోష్ నాయర్. విశేషమేమిటంటే అటు తల్లి పేరే కాదు భార్య పేరు కూడా రాజలక్ష్మి కావడం గమనార్హం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×