E-Paper
Advertisement

మరింత స్టైలిష్‌గా కర్వ్ EV.. కొత్త రంగులో ఏముంది భయ్యా!

మరింత స్టైలిష్‌గా కర్వ్ EV.. కొత్త రంగులో ఏముంది భయ్యా!
Advertisement

Curvv EV Series X: వినియోదారులను ఆకట్టుకునేలా సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా కర్వ్ EVకి సంబంధించి కొత్త సిరీస్ ను తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీని కొత్త  సిరీస్X వేరియంట్లతో అప్ డేట్ చేసింది. అదే సమయంలో అదిరిపోయే కలర్ ఆప్షన్స్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది.

రెండు కొత్త వేరియంట్లు విడుదల

కర్వ్ EV మోడల్ నుంచి రెండు కొత్త వేరియంట్లు విడుదల అయ్యింది. ‘అకాంప్లిష్డ్ X 55’తో పాటు ‘ఎంపవర్డ్ X 55’ అనే వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. కాంప్లిష్డ్ X 55 ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. పాత వేరియంట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లబిస్తుంది. ఇక ఎంపవర్డ్ X 55 ధర రూ. 19.19 లక్షలుగా నిర్ణయించింది. ఇది ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌ గా నిలుస్తుంది. మరింత స్టైలిష్ లుక్ కోరుకునేవారికి, అదనంగా రూ. 30,000 చెల్లిస్తే  డార్క్ ఎడిషన్ కారును తీసుకునే అవకాశం ఉంది.

అందుబాటులోకి కొత్త కలర్ ఆప్షన్

Advertisement

ఈ కొత్త సిరీస్ X అప్‌ డేట్‌ లో కొత్త కలర్ ఆప్షన్ జోడించారు. ఇప్పటికే ఉన్న వైట్, గ్రే, ఆరెంజ్ షేడ్స్‌ కు తోడు నైట్రో క్రిమ్సన్ అనే ఎరుపు రంగును తీసుకొచ్చారు. ఈ కొత్త కలర్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

ఫీచర్ల గురించి..

కర్వ్ EV ఇప్పుడు మరింత ప్రీమియం ఫీలింగ్ ను అందిస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీటు లాంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

భద్రత విషయంలో కీలక ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో కూడా ఈ కారు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ముఖ్యమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్లైండ్ స్పాట్ మానిటర్, పార్కింగ్ సెన్సార్లు కూడా డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి.

టాప్ వేరియంట్ అయిన ఎంపవర్డ్ X 55లో అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాయిస్ ద్వారా సన్‌ రూఫ్ కంట్రోల్,  మూడ్ లైటింగ్, JBL సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్ లాంటి ఫీచర్లు ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ ను  ఇస్తాయి. అంతేకాకుండా, లెవెల్-2 ADAS టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

బ్యాటరీ గురించి..

ఈ సిరీస్X వేరియంట్లు 55 kWh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి.  సింగిల్ మోటార్‌తో పని చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 502 కి.మీ. వరకు ప్రయాణం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం 40 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌ కు టాప్ ఛాయిస్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×