E-Paper
Advertisement

ఓటీటీలోకి రాబోతున్న ‘పాపం ప్రతాప్’ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి రాబోతున్న ‘పాపం ప్రతాప్’ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Papam Prathap OTT: ఒక సినిమా థియేటర్లో విడుదలైన అంటే 28 రోజులలోనే తిరిగి ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఏప్రిల్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ‘పాపం ప్రతాప్’ సినిమా ఒకటి. ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇలా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ కైవసం చేసుకున్నారు.

ఈటీవీ విన్ లో పాపం ప్రతాప్..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఈటీవీ విన్ (Etv Win)అధికారకంగా వెల్లడించారు. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తిరువీర్(Thiruveer), పాయల్ రాధాకృష్ణ(Payal Radhakrishna) జంటగా నటించగా, అజయ్ ఘోష, సీనియర్ నటి రాశి వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌, కృషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరె వ్యవహరించారు. మరి థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

మే 7 న ఓటిటిలోకి పాపం ప్రతాప్..

Advertisement

ఇటీవల కాలంలో నటుడు తిరువీర్ పలు విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. పాపం ప్రతాప్ సినిమా కూడా టైటిల్ కు అనుగుణంగానే పాపం అనిపించిందని చెప్పాలి. మరి మే 7వతేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాపం ప్రతాప్ సినిమాకు డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది.. ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

ప్రతాప్ (తిరువీరు) కి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టం. ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు చివరికి తనని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వీరి మధ్య అసలు గొడవ మొదలవుతుంది. పెళ్లి తర్వాత మూడు రాత్రులకే ప్రతాప్ కు సమస్య ఉంది అంటు బుజ్జమ్మ తనని వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే ఆ సమస్య ఏంటనేది మాత్రం పెద్దలకు చెప్పదు. తను తిరిగి కాపురానికి వెళ్లాలి అంటే తన సమస్య ఏంటో ప్రతాప్ తెలుసుకోవాలని బుజ్జమ్మ చెబుతుంది. మరి బుజ్జమ్మ అంటే ఎంతో ఇష్టం ప్రేమ ఉన్నటువంటి ప్రతాప్ తనలో ఉన్న సమస్యను గుర్తించగలుగుతాడా? ఆ సమస్యలు కనుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరికి తన తప్పును తన సమస్యను సరిదిద్దుకున్నాడా? తిరిగి బుజ్జమ్మ ప్రతాప్ వద్దకు వెళ్లిందా? అనేది ఈ సినిమా కథ. ఇక థియేటర్లలో ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిన పాపం ప్రతాప్ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: కొత్తింట్లోకి అడుగు పెట్టిన జబర్దస్త్ కమెడియన్… వైరల్ అవుతున్న వీడియో..

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×