E-Paper
Advertisement

Monalisa -Farman khan: మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా నటుడా .. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే?

Monalisa -Farman khan: మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా నటుడా .. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే?
Advertisement

Monalisa -Farman khann:  ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళ సమయంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా నిలిచారు మోనాలిసా. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న మోనాలిసా వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈమెకు సెలబ్రిటీ హోదా లభించింది. అలాగే పలువురు దర్శక నిర్మాతలు ఈమెకు ఏకంగా సినిమాలలో అవకాశాలు కల్పిస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు . ప్రస్తుతం మోనాలిసా (Monalisa)హిందీ, మలయాళ, తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్గా బిజీగా అవుతున్న తరుణంలోనే ఈమె పెళ్లి చేసుకొని మరోసారి వార్తల్లోకి నిలిచారు.

ఫర్మాన్ ఖాన్ కూడా నటుడేనా…

ఈమె ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ (Farman Khan) అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఇక వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి వీరి వివాహం లవ్ జిహాద్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై మోనాలిసా స్పందిస్తూ మేము హిందూ సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్నామని మాది లవ్ జిహాద్ కాదు అంటూ  విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ఇలా వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోనాలిసా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఏం చేస్తారు? అనే విషయాలపై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మోనాలిసా సినిమాలో విలన్ గా ఫర్మాన్ ఖాన్  ..

Advertisement

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్  విషయానికి వస్తే ఈయన కూడా నటుడు అనే తెలుస్తోంది.ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పత్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన హిందీ ,మలయాళం, తమిళ సినిమాలలో నటుడిగా పని చేస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇతనితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారిందని మోనాలిసా తెలిపారు. ఇక వీరిద్దరూ కలిసి పి. బిను వర్గీస్ దర్శకత్వంలో వచ్చిన నాగమ్మ అనే మలయాళ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

మోనాలిసా పెళ్లి పై డైరెక్టర్ కామెంట్స్..

Advertisement

ఈ సినిమాలో మోనాలిసా ప్రధాన పాత్రలో నటించగా ఈ సినిమాలో ఫర్మాన్ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. ఇలా మోనాలిసా మాత్రమే కాకుండా ఆమె చేసుకున్న వ్యక్తి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే అని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇక మోనాలిసా పెళ్లి వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈమె పెళ్లి చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ కేరళ పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు అదే విధంగా పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ విధంగా మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసాది ప్రేమ వివాహం కాదు, బలవంతపు వివాహం అంటూ కూడా విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకు అవమానం… ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ చూస్తే షాకే! ఆ అట్టర్ ప్లాప్ కంటే ఘోరం! 

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×