E-Paper
Advertisement

BenQ GV32 Projector: ఇంటి సీలింగ్‌పై సినిమా హాల్.. పడుకుని ఎంచక్కా సినిమా చూడొచ్చు!

BenQ GV32 Projector: ఇంటి సీలింగ్‌పై సినిమా హాల్.. పడుకుని ఎంచక్కా సినిమా చూడొచ్చు!
Advertisement

BenQ GV32 Projector: ఈ రోజుల్లో స్మార్ట్‌ టీవీ లేని ఇల్లు ఉండదు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు. దాని కోసం పెద్ద స్క్రీన్ టీవీలను హాల్లోనే సెట్ చేసుకుంటున్నారు. అయితే, ఒకేచోట కూర్చుని టీవీ చూడటం అప్పుడప్పుడు బోర్ కొడుతుంది. ముఖ్యంగా చలికాలంలో లేదా రాత్రిపూట హాయిగా పడుకుని, సీలింగ్ (పైకప్పు) మీద సినిమా చూడాలని చాలామంది కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసమే BenQ కంపెనీ తమ కొత్త GV32 పోర్టబుల్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

చూడగానే నచ్చేసే డిజైన్..

మొదట ఈ పోర్ట‌బుల్ ప్రొజెక్టర్ లుక్ గురించి చెప్పుకోవాలి. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. దీని బరువు కేవలం 1.6 కిలోలు మాత్రమే. దీంతో ఇంటి నుంచి బయటకి వెళ్లేటప్పుడు కూడా ఈజీగా పట్టుకెళ్లొచ్చు. దీనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీని మాగ్నెటిక్ స్టాండ్. దీని వల్ల ప్రొజెక్టర్‌ను 360 డిగ్రీలు తిప్పొచ్చు. సినిమా గోడ మీద చూడాలనుకున్నా, హాయిగా పడుకుని పైన సీలింగ్ మీద చూడాలనుకున్నా మనకు నచ్చినట్టు యాంగిల్ మార్చేయొచ్చు.

Advertisement

Also Read: రూ.30 వేలకే 4K స్మార్ట్ టీవీ.. అమెజాన్ సేల్‌లో టాప్-5 మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు!

సినిమా థియేటర్ ఫీల్..

దీనిలో 1080p ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉంటుంది. చాలా పోర్టబుల్ ప్రొజెక్టర్లలో క్లారిటీ సరిగ్గా ఉండదు. కానీ ఇందులో కలర్స్ చాలా రిచ్‌గా, నేచురల్‌గా అనిపిస్తాయి. దీని బ్రైట్‌నెస్ 500 ANSI ల్యూమెన్స్. తద్వారా చీకటి గదిలో దీని పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. పగటిపూట కిటికీలు తెరిచి చూస్తే కాస్త వెలుతురు అనిపించవచ్చు కానీ, లైట్లు ఆపేసి చూస్తే మాత్రం థియేటర్‌లో ఉన్నట్టే ఫీలవుతారు.

సౌండ్ క్వాలిటీ అదుర్స్..

Advertisement

సాధారణంగా ప్రొజెక్టర్ అనగానే అదనంగా స్పీకర్లు కొనుక్కోవాలి అనుకుంటాం. కానీ ఈ BenQ GV32 విషయంలో ఆ అవసరం లేదు. దీనిలో 2.1 ఛానల్ ఆడియో సిస్టమ్ ఉంది. రెండు స్పీకర్లతో పాటు ఒక చిన్న సబ్‌వూఫర్ కూడా లోపలే ఇచ్చారు. దీనివల్ల Bass చాలా బాగా వస్తుంది. సినిమా చూస్తున్నా లేదా పాటలు వింటున్నా సౌండ్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడక్కర్లేదు.

స్మార్ట్ ఫీచర్లు అదనం..

ఇది Google TVతో వస్తుంది కాబట్టి.. టీవీలో లాగే నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ అన్నీ ఇందులో ఉంటాయి. విడిగా ఎలాంటి కేబుల్స్ లేదా లాప్‌టాప్ కనెక్ట్ చేయాల్సిన పనిలేదు. వై-ఫై ఉంటే చాలు.. నేరుగా సినిమాలు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ నుంచి ఫొటోలు, వీడియోలను స్క్రీన్ మీదకు షేర్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.2,400 లోపు ‘క్రోమా 2000W ఇండక్షన్’ కుక్‌టాప్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×