E-Paper
Advertisement

Minister Vivek Venkataswamy: విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

Minister Vivek Venkataswamy: విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
Advertisement

Minister Vivek Venkataswamy:  మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సాప్ కోడ్ ఇనోవేషన్ రూమ్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఆలోచనతో ఈ విద్యాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలంటే శ్రద్ధగా వినడం, క్రమశిక్షణతో చదవడం ఎంతో అవసరమన్నారు.

Also  Read: Supreme Court: నెలసరి సెలవు ఇష్యూ.. అలాగైతే మహిళల కెరీర్‌ క్లోజ్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

శ్రద్ధతో నేర్చుకోవాలి 

Advertisement

తన విద్యార్థి దశలో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఏ పని చేసినా శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కొత్త కొత్త సాంకేతికతలు వస్తున్నాయని, వాటిని చూసి భయపడకుండా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. సాంకేతికతను అవగాహన చేసుకుంటే భయం ఉండదన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంకటస్వామి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చి సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పావనీ జంగయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Also  Read:Harish Rao: మూసీ పునరుజ్జీవనం కాదు.. అది సీఎం రేవంత్ రెడ్డి ‘లూటిఫికేషన్’: హరీశ్ రావు

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×