E-Paper
Advertisement

Monalisa: కుంభమేళా మోనాలిసా తొలి రెమ్యూనరేషన్ తో ఏం చేస్తోందో తెలుసా?

Monalisa: కుంభమేళా మోనాలిసా తొలి రెమ్యూనరేషన్ తో ఏం చేస్తోందో తెలుసా?

Monalisa:అదృష్టం ఉండాలి కానీ ఒక్క రాత్రిలో పాపులారిటీ సంపాదించుకోవచ్చు అని నిరూపించింది కుంభమేళా మోనాలిసా (Monalisa). ఎక్కడో బ్రతుకుతెరువు కోసం పూసలమ్ముకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న ఆమె.. ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగిన మహా కుంభమేళాతో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. నిజానికి ఈమె అందాన్ని చూసి ముగ్ధుడైన ఒక వ్యక్తి ఆమె ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్స్ .. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఆమె ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసారు. పైగా మహాకుంభమేళాలో కొంతమంది ఆమెతో సెల్ఫీలు దిగడానికి కూడా ప్రయత్నం చేశారు. దీంతో తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతోందని భావించిన ఆమె తండ్రి.. ఆమెను ఇంటికి పంపించేసిన విషయం తెలిసిందే.

రాత్రికి రాత్రే స్టార్ గా మారిన మోనాలిసా..

అలా ఒక్క ఫోటో ఆమెను రాత్రికి రాత్రే స్టార్ ను చేసేసింది. దీనికి తోడు ఆమెను సినిమాలలోకి తీసుకురావడానికి ఒకసారి డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి ఆమెను తమ సినిమాలోకి తీసుకుంటున్నట్లు హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఒక హీరోతో కలిసి మోనాలిసా వీడియో సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈమధ్య పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ కి కూడా వెళ్తూ..మరింత పాపులారిటీ సంపాదించుకుంది మోనాలిసా. ఇదిలా ఉండగా తాజాగా తన తొలి సినిమా రెమ్యూనరేషన్ తో ఒక గొప్ప పని చేయబోతోంది. ఆ విషయం తెలిసి ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మొదటి రెమ్యూనరేషన్తో అలాంటి పని..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈమె ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన మోనాలిసా ఎమోషనల్ అయ్యింది. సినీ ప్రపంచం , తన పాత జీవితం రెండింటిని సమానంగా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ కు తిరిగి వచ్చిన మోనాలిసా గంగా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ధన్యవాదాలు కూడా తెలిపింది. మహా కుంభమేళలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని తన జీవితాన్ని మార్చిన ఈ సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది.

వ్యక్తిగత సౌకర్యాల కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం..

ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ..” నా మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యూనరేషన్ తో మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించాలన్నదే నా కల. ఆ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యా అవకాశాలు లేవు. చదువుకోని బాలికలు జీవితంలో వెనుకబడి పోతున్నారు. బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. అందుకే నా సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా భవిష్యత్తు తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నాను” అంటూ మోనాలిసా చెప్పుకొచ్చింది.

ALSO READ:Tollywood: పక్షవాతంతో మంచానపడ్డ స్టార్ హీరో.. కట్ చేస్తే.. ఆ డెడికేషన్ కి ఫిదా!

తెలుగు చిత్రాలతో మోనాలిసా బిజీ..

మోనాలిసా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్. మొత్తానికైతే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ మూలాలను మరిచిపోకుండా తాను నివసించిన ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని చూస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మోనాలిసా. మోనాలిసా గొప్ప ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×