E-Paper
Advertisement

Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ ఫైర్..!

Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండిసంజయ్ ఫైర్..!
Advertisement

Bandi Sanjay: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ చెల్లించకుండా మానసిక వేదనకు గురిచేయడం న్యాయమా? అని, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానవత్వం ఉందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం బండి సంజయ్ లేఖ రాశారు. ఉద్యోగులు రిటైర్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్‌ బకాయిలను చెల్లించకపోవం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.

జీవిత మలి సంధ్యలో..

రిటైర్డ్ ఉద్యోగుల చావులకు సర్కార్ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ అని లేఖలో పేర్కొన్నారు. జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదిగా పరిగణించారు. ముక్కు, ముఖం తెలియని వృద్ధులు కష్టాల్లో ఉంటేనే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనదని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Tollywood: మరో కొరియోగ్రాఫర్ దర్శకుడిగా.. ఎవరో తెలుసా?

పెద్ద ఎత్తున ఆందోళన

ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్‌ అన్నీ చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే ఈ ఇష్యూను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారి బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోనని స్పష్టంచేశారు.

Advertisement

Also Read: Intinti Ramayanam Today Episode: రాజేంద్రను చూసి కన్నీళ్లు పెట్టుకున్న అవని.. పల్లవి కన్నింగ్ ప్లాన్.. గ్రాండ్ గా శ్రీయ సీమంతం..

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×