E-Paper
Advertisement

Tollywood: పక్షవాతంతో మంచానపడ్డ స్టార్ హీరో.. కట్ చేస్తే.. ఆ డెడికేషన్ కి ఫిదా!

Tollywood: పక్షవాతంతో మంచానపడ్డ స్టార్ హీరో.. కట్ చేస్తే.. ఆ డెడికేషన్ కి ఫిదా!
Advertisement

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది తమ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. తిండి నిద్ర మానేసి అనారోగ్య బారిన పడినప్పటికీ కూడా సినిమాల కోసం వారు పడే కష్టం వర్ణనాతీతం. పైగా ఒక్కొక్కసారి ఈ సినిమాల కోసమే జీవితాంతం వికలాంగులుగా మారిన సెలబ్రిటీలు కూడా లేకపోలేదు.. అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో ఏకంగా పక్షవాతంతో మంచానికే పరిమితమై.. తిరిగి మళ్లీ తనను తాను ఆ అనారోగ్యాన్ని జయించి ఇప్పుడు స్టార్ విలన్ గా, హీరోగా సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ఎవరో కాదు అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు దక్కించుకున్న కోలీవుడ్ హీరో అరవింద్ స్వామి (Aravind Swamy).

పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాను..

నటన పరంగానే కాకుండా అటు గ్లామరస్ పరంగా కూడా మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాంబే, రోజా వంటి చిత్రాలతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అరవింద్ స్వామి.. ఇండస్ట్రీలో వరుస సినిమాలతో కెరియర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. ఇక మళ్లీ కొన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ప్రధాన పాత్రలతో నటిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. ఎందుకు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమయ్యారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..” 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు నొప్పితో భరించలేకపోయాను. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవలసి పరిస్థితి ఏర్పడింది. దాంతో శస్త్ర చికిత్స కంటే ఆయుర్వేద వైద్యమే నయమని భావించి.. కేరళకు చెందిన ఒక ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించాను.

ఆయుర్వేదమే నన్ను గట్టెక్కించింది..

Advertisement

ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయాను. కానీ ఆ ఆయుర్వేదం నన్ను మూడు రోజుల్లోనే తిరిగి నడిచేలా చేసింది. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అయితే నాకు పని చేసింది. కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని నేను సూచించడం లేదు. అందుకే ఎవరినైనా సరే గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. వైద్యుల సూచనల మేరకు మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి” అంటూ సూచనలు ఇచ్చారు అరవింద్ స్వామి.

ALSO READ:HBD Sumanth: సుమంత్ బర్త్ డే సర్ప్రైజ్.. మహేంద్రగిరి వారాహి నుంచీ స్పెషల్ గ్లింప్స్!

మానసిక ధైర్యమే మనల్ని ఆరోగ్యవంతులని చేస్తుంది..

Advertisement

ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ..” నొప్పి, కదలలేని పరిస్థితి కంటే మానసికంగా ధైర్యంగా ఉండడం అత్యంత ప్రధానం. ఆ పరిస్థితుల్లో “నాకే ఎందుకు ఇలా” అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా రాకూడదు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో నేను బిజీ అయిపోయాను. ఇక ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక సినీ రంగంలోకి రావాలనుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఉపయోగించిన మందుల వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి గుర్తు పట్టలేనంతగా మారిపోయాను. ఇక అందుకే సినిమాల్లోకి రాకూడదు అనుకున్నాను. ఇప్పుడు మళ్లీ నన్ను నేను మునుపటి అరవిందస్వామిలా మార్చుకొని మళ్లీ మీ ముందుకు వస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అరవిందస్వామి జీవితంలో ఇంత కష్టం అనుభవించారా అని అభిమానులు కూడా నిట్టూరుస్తున్నారు.

Related News

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×