E-Paper
Advertisement

MAA పేరుతో మోసాలు… కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన మా అసోసియేషన్!

MAA పేరుతో మోసాలు… కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన మా అసోసియేషన్!
Advertisement

Movie Artistes Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా 24 క్రాఫ్ట్ ను ఉద్దేశించి ఒక అధికారక ప్రకటనను తెలియజేశారు.. మా అసోసియేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులకు ప్రాతినిధ్యం వహిస్తూ గుర్తింపు పొందిన సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie Artistes Association). మా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ తో అనుసంధానం ఏర్పడి గుర్తింపు పొందింది. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ల సమన్వయంతో పనిచేసే ఏకైక కళాకారుల సంఘం కూడా మా అసోసియేషన్ అని చెప్పాలి. ఇలా కళాకారుల బాగోగులను చూసుకొనే ఏకైక సంఘం కూడా మా అసోసియేషన్.

MAA పేరుతో మోసాలు..

ఇలా 24 క్రాఫ్ట్ లో కళాకారులకు ఎంతో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా అసోసియేషన్ పేరుతో కొంతమంది మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం MAA దృష్టికి చేరడంతో ఈ విషయంపై మా అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది వ్యక్తులు అలాగే అనధికారక సమూహాలు MAA పేరును దుర్వినియోగం చేస్తూ ఆర్టిస్టుల నుంచి రూల్స్ కి విరుద్ధంగా డబ్బు వసూలు చేయడానికి “AP MAA”, “MAAAP” పేరుతో కళాకారులను తప్పుదారి పట్టిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు.

కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు..

Advertisement

ఈ విషయం గురించి MAA స్పందిస్తూ.. తాము “AP MAA”, “MAAAP” వంటి సంస్థలు MAA ద్వారా అధికారకంగా గుర్తించబడలేదు. MAA పేరుమీద ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి తాము అధికారం ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాము .అలాగే MAA పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు లేదా ఆర్టిస్టులను, ప్రజలను తప్పుదారి పట్టించినట్టు రుజువైతే కచ్చితంగా కఠినమైన, చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ విధమైనటువంటి మోసపూరిత సంఘాలలో ఎటువంటి చెల్లింపులు చేయొద్దని అలాంటి వారి దగ్గర సభ్యత్వం తీసుకోవద్దని కళాకారులకు సూచనలు చేశారు.

మా అసోసియేషన్ గౌరవాన్ని కాపాడుదాం..

Advertisement

ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ఆర్టిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటివి ఎవరికైనా ఎదురైతే నేరుగా MAA కార్యాలయానికి ఫిర్యాదులు చేయాలని కోరారు. “మా” అసోసియేషన్ గౌరవం, ఐక్యత, సమగ్రతను కాపాడటానికి మనమందరం ఐక్యమత్యంతో నిలబడదాం అంటూ మా అసోసియేషన్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల కళాకారులను అప్రమత్తం చేస్తూ అధికారకంగా తెలియజేశారు. అలాగే మా పేరుతో జరిగే మోసాల పట్ల కూడా స్పందిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: సల్మాన్ ఖాన్ విలన్ గా పుష్ప నటుడు.. వేట మొదలు పెట్టిన వంశీ పైడిపల్లి!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×