Celebrity Marriage: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే క్షణాలలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కెరియర్ మోజులో పడి వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోతున్నారు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అభిమానులు మాత్రం తమ అభిమాన నటీనటులు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా వారికి ఆలోచనలు లేకపోయినా ఆ ఆలోచనలను కలిగించి మరీ వారిని పెళ్లి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు..
ఇకపోతే మరికొంతమంది వయసు మించిపోతున్నా పెళ్లి ఆలోచన చేయకపోవడంతో ఎవరితోనైనా కనిపించినా లేకపోయినా సరే పెళ్లి రూమర్లను సృష్టిస్తూ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీ అయితే చాలు వారికి ఈ పెళ్లి రూమర్స్ అనేవి తలనొప్పిగా మారుతున్నాయి. మరి పెళ్లి రూమర్స్ తో సతమతమవుతున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సల్మాన్ ఖాన్ , ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు ముందుగా గుర్తుకొస్తారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ 50 సంవత్సరాలు దాటినా.. ప్రభాస్ 40 ఏళ్లు దాటినా ఇంకా వివాహం వైపు మొగ్గు చూపలేదు. ఇక హీరోల దారిలోనే హీరోయిన్లు కూడా వివాహం చేసుకోకుండా కెరియర్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా వివాహానికి మాత్రం ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పటి నుంచే పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ అనుష్క స్పందించలేదు. అయితే ఈమధ్య కొంతమంది అనుష్కకి ఏకంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారు. గతంలో ఒక ఫ్యాషన్ షోలో ఒక వ్యక్తి చేతిని పట్టుకొని ఆమె నడుస్తున్నట్లు, ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనుష్క నిశ్చితార్థం అయ్యింది.. త్వరలోనే పెళ్లి అంటూ పుకార్లు సృష్టించారు. అయితే ఆ ఫోటో ఫేక్ అని తెలిసిపోయింది. పైగా అనుష్క కూడా స్పందించకపోవడంతో అవి పుకార్లు గానే మిగిలిపోయాయి.
ఇకపోతే ఇలాంటి రూమర్లు ఎదుర్కొంటున్న మరో హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె పరిస్థితి కూడా ఇంతే.. ఈమెకు తెలియకుండానే ఈమె పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పటికే ఒక అబ్బాయిని ప్రేమించిందని త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతోంది అంటూ నెటిజన్స్ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. దీంతో స్పందించిన సాయి పల్లవి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని కొట్టిపారేసింది.
ALSO READ:ఓటీటీలోకి శివాజీ – లయ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని!
ఇకపోతే మరొకవైపు త్రిష కూడా అటు విజయ్ తో రిలేషన్ లో లేకపోయినా ఆమె రిలేషన్ లో ఉందనే పుకార్లు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అతడిని పెళ్లి చేసుకోబోతుందని అందుకే ఆయన భార్య సంగీత విడాకులు కోరింది అంటూ వార్తలు కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ హీరోయిన్లందరికీ ఈ పెళ్లి రూమర్లు తలనొప్పిగా మారాయి అని చెప్పవచ్చు.