E-Paper
Advertisement

ఓటీటీలోకి శివాజీ – లయ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని!

ఓటీటీలోకి శివాజీ – లయ సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని!
Advertisement

Sampradayani Suppini Suddapoosa:ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు శివాజీ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు..ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈయన 90′ స్ బయోపిక్ తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కోర్ట్ , దండోరా తోపాటు మరికొన్ని చిత్రాలలో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అటు బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిలో శివన్నగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి శివాజీ ఇటీవల నటించిన చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’. ఒకప్పుడు తనతో మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి చిత్రాలతో జంటగా నటించి.. ఆకట్టుకున్న లయతో మళ్లీ 14 ఏళ్ల తర్వాత సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు శివాజీ.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని

ఇకపోతే ఈ సినిమాను మొదట థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకి వస్తున్న ఆదరణను గుర్తించి ఓటీటీలో కాకుండా మళ్లీ నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని శివాజీ నిర్ణయం తీసుకున్నారు. అలా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.. ఇకపోతే ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ , లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వేదికగా ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికైతే డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

also read:రంగస్థలం @8ఏళ్లు.. ఎవరికి తెలియని తెరవెనుక విషయాలు?

సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని సినిమా స్టోరీ..

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శ్రీరామ్ (శివాజీ) నిజాయితీపరుడైన ఒక పంచాయతీ కార్యదర్శి.. కొత్తకోట సమీపంలోనే హార్సిలీ హిల్స్ లో భార్య ఉత్తర (లయ) , కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్) తో తన కొడుకు చేసే తింగరి పనులు శ్రీరామ్ కి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంటాయి. ఒకరోజు దీపావళి రోజున వాళ్ళ ఇంటికి ఆ వూరు ఎస్ఐ విక్రం వాసుదేవ్ వస్తాడు. అతడికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువం అప్పటికే శ్రీరామ్ తో ఒకసారి గొడవ కూడా జరిగి ఉంటుంది..శ్రీ రామ్ ఇంట్లో ఎవ్వరూ లేరని తెలిసి ఉత్తరపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే అనూహ్యంగా శ్రీరామ్ కొడుకు చేతిలో ఆ ఎస్సై విక్రమ్ హత్యకు గురవుతాడు. ఇక ఆ తర్వాత ఏమయ్యింది ? ఈ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు శ్రీరామ్ ఏం చేశాడు ? ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్ళు పడిన తిప్పలు ఏమిటి ? నిజంగా విక్రమ్ హత్యకు, శ్రీరామ్ కొడుకుకి ఏదైనా సంబంధం ఉందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Related News

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×