E-Paper
Advertisement

IBomma one: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. ఇప్పుడు పోలీసులకు డబుల్ సవాల్

IBomma one: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. ఇప్పుడు పోలీసులకు డబుల్ సవాల్
Advertisement

IBomma One: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఐ బొమ్మ(IBomma) పేరు వినపడుతోంది. కొత్త సినిమాలు థియేటర్లోకి విడుదలైందే ఆలస్యం వెంటనే పైరసీలో చూసే వెసులుబాటును కల్పించారు. ఇలా ఐ బొమ్మ సైట్ ద్వారా వేల సంఖ్యలో సినిమాలను పైరసీల్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి కోట్లలో నష్టాలను తీసుకువచ్చారు. దీంతో పైరసీకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో పోలీసులు చర్యలు తీసుకుని ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని (Immadi Ravi)అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇమ్మడి రవి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇలా రవి అరెస్టు కావడంతో పైరసీకి అడ్డుకట్టు వేసినట్లేనని అందరూ భావించారు.

వెలుగులోకి ఐ బొమ్మ వన్…

ఇలాంటి తరుణంలోనే ఐ బొమ్మ పోలీసులకు, చిత్ర పరిశ్రమకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐ బొమ్మ తిరిగి మళ్లీ రావడంతో పోలీసులకు డబుల్ ఛాలెంజ్ గా మారిందని చెప్పాలి. తాజాగా ఐ బొమ్మ వన్(I Bomma One) అనే పైరసీ సైట్ వెలుగులోకి రావడమే కాకుండా కొత్త సినిమాలు కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అందరూ షాక్ అవుతున్నారు. ఇదివరకు ఐ బొమ్మలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే వచ్చేవి కానీ, ఐ బొమ్మ వన్ లో మాత్రం ఇతర భాషలో కూడా సినిమాలు రావడం గమనార్హం. ఈ ఐ బొమ్మ వన్ సైట్ లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే వెంటనే మూవీ రూల్జ్ కు రీ డైరెక్ట్ అవుతుంది.

65 మిర్రర్ వెబ్ సైట్లు..

Advertisement

ఐ బొమ్మ ఎకో సిస్టంలో దాదాపు 65 మిర్రర్ వెబ్ సైట్ లు ఉన్నాయని, వీటిలో ఐ బొమ్మవన్ ను ప్రచారంలోకి తీసుకువచ్చింటారని పోలీసులు భావిస్తున్నారు. ఇలా ఈ పైరసీ సైట్ వెలుగులోకి రావడంతో మూవీ రూల్జ్ తమిళ MV సైట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు పైరసీకి అడ్డుకట్టు వేసినట్లేదని భావించారు. ఇక ఐ బొమ్మ నుంచి కూడా ఈ సైట్ క్లోజ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితే రెండు రోజులకి ఇలా ఐ బొమ్మ వన్ పేరిట మరొక సైట్ వెలుగులోకి రావడంతో ఐ బొమ్మ వెనుక పెద్ద పైరసీ రాకెట్ నడుస్తుందని స్పష్టం అవుతుంది.

సోషల్ మీడియాలో రవికి మద్దతు..

Advertisement

ప్రస్తుతం ఇమ్మడి రవి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జైలులో ఉన్న తనను విచారణ చేయటానికి పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా అందుకు అనుమతులు తెలిపింది. దీంతో పోలీసులు ఐదు రోజులపాటు ఇమ్మడి రవిని విచారణ చేయనున్నారు. మరి ఈ విచారణలో భాగంగా ఐ బొమ్మ వన్ గురించి ఏదైనా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా? ఐ బొమ్మ వన్ వెనుక కూడా రవి హస్తం ఉందా? అనే విషయాలు తెలియనున్నాయి. అయితే రవి అరెస్టు కావడంతో కేవలం చిత్ర బృందం మాత్రమే సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా రవి అరెస్టుకు వ్యతిరేకంగా పోస్టులు రావడం, సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు పెరగటం గమనార్హం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×