E-Paper
Advertisement

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

Movie Sequels: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హిట్టయిన సినిమాకు సీక్వెల్ తీయడం అనేది రేర్. కానీ, ఈ మధ్య కాలంలో సినిమా కాస్త ఆడగానే పార్ట్-2, పార్ట్-3 అంటూ బోర్డులు తగిలించేసి కలెక్షన్లని దండుకుంటున్నారు.ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయితే ఆ తర్వాతి భాగాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే అత్యాశ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌ను, ఆ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని వచ్చే సీక్వెల్స్ పై కోట్లు గుంజాలనే స్ట్రాటజీ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోంది.

తాజాగా కొన్ని భారీ చిత్రాల సీక్వెల్స్ ప్రకటనలు, వాటి వెనుక జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే ఈ డౌట్స్ మరింత రైజ్ అవుతున్నాయి. అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉందనే సాకుతో, కథ లేకుండా కేవలం బ్రాండ్ ఇమేజ్‌తో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించాలన్నట్టుగా మేకర్స్ తీరు కనిపిస్తుంది. అయితే, కొందరు మేకర్స్ మాత్రం ఈ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, స్క్రిప్ట్ పనులన్న సాకుతో డిలే చేస్తూ చివరికి అంచనాలను అందుకోలేక చేతులెత్తేస్తున్నారు.

కథను సరిగ్గా డెవలప్ చేయలేకనేనా ?

ఈ క్రమంలోనే ‘లోకా (లోకా) చాప్టర్ 2’ గురించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది.ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో పార్ట్-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి హైప్ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తారు. కానీ, ఈ మూవీ టీమ్ మాత్రం సినిమా విజయంతో సంబంధం లేకుండా కంటెంట్‌పైనే దృష్టి పెట్టామని వారు చెబుతున్నప్పటికీ, కథను సరిగ్గా డెవలప్ చేయలేకనే సినిమాను ఆలస్యం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎంత వృత్తిపరమైన నిబద్ధత ఉన్నా, సరైన సమయంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేలేకపోతే ఆ హైప్ కాస్తా నీరుగారిపోయే ప్రమాదం ఉందనే నిజాన్ని మర్చిపోతున్నారు కాబోలు.

మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడం కష్టం

మరోవైపు, యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ‘ప్రేమలు’ చిత్ర సీక్వెల్‌పైనా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సాధించిన సక్సెస్ తర్వాత ‘ప్రేమలు 2’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ చిత్రానికి సీక్వెల్ సాధ్యం కాదని ఆ సినిమా హీరో స్వయంగా స్పష్టం చేయడం గమనార్హం. మొదటి భాగం తెచ్చిన క్రేజ్‌ను వాడుకుని కేవలం బిజినెస్ కోసం సినిమా తీయడం తమకు ఇష్టం లేదని, పక్కాగా సరిపోయే కథ కుదిరితేనే సీక్వెల్ తీసుకొస్తామని వారు చెబుతున్నారు. వినడానికి ఇది బాగానే ఉన్నా, అసలు మ్యాటర్ ఏంటంటే మొదటి భాగంలో ఉన్న మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడం అంత ఈజీ కాదు. ఆ భయంతోనే మేకర్స్ సీక్వెల్‌ను పక్కన పెట్టేస్తున్నారనేది ఇన్ సైడ్ టాక్.

సెట్స్ మీదకి వెళ్తాయా ?

ఇక ప్యాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న ‘కేజీఎఫ్ 3’, ‘లియో 2’సినిమాల విషయంలో కూడా ఇదే డ్రామా నడుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని చాలా ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చేశారు. రాకీ భాయ్ పాత్రపై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాలను అందుకోవాలంటే మరింత సమయం, బలమైన సబ్జెక్ట్ అవసరమని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అంతకు మించిన సబ్జెక్ట్ దొరకడం గగనమైపోయింది. అందుకే ‘కేజీఎఫ్ 3’ ని ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేశారు.
అలాగే దళపతి విజయ్ నటించాల్సిన ‘లియో 2’ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతానికి పట్టాలెక్కే సూచనలు అస్సలు కనిపించడం లేదు. లోకేష్ కనగరాజ్ ఎల్‌సియు (LCU) లో భాగంగా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీనికి తోడు విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టి పెట్టడంతో ‘లియో 2’ దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఈ జాబితాలోకి టాలీవుడ్ సంచలనాలు ‘సలార్ 2’, ‘పుష్ప 3’ కూడా వచ్చి చేరాయి. ప్రభాస్ ‘సలార్’ మొదటి భాగం ఓ మోస్తరుగా ఆడినా, సీక్వెల్ ‘శౌర్యాంగ పర్వం’ అంటూ హడావిడి చేశారు. కానీ ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం, ప్రభాస్ వరుసగా వేరే సినిమాలు లైన్ లో పెట్టడంతో ‘సలార్ 2’ ఇప్పట్లో రావడం కష్టమే అని తేలిపోయింది.
ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రాకముందే ‘పుష్ప 3’ కూడా ఉంటుందంటూ లీకులు ఇచ్చారు. కానీ పార్ట్ 2 మేకింగ్ లోనే అష్ట కష్టాలు పడ్డ సుక్కు పార్ట్ 3 ని నెత్తినేసుకుంటాడా అంటే అనుమానమే.కేవలం హైప్ పెంచి బిజినెస్ రేట్లు పెంచుకోవడానికే ఈ పార్ట్ 3ల ముచ్చట అని ఇండస్ట్రీ టాక్.

కొత్త కథలతో వస్తేనే మంచిది

అటు బాలీవుడ్ లోనూ ఇదే వరస నడుస్తోంది. రణబీర్ కపూర్ ‘యానిమల్’ క్రియేట్ చేసిన అరాచకానికి సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగా మైండ్ సెట్ కు, ఆ వైల్డ్ నెస్ కు పార్ట్ 2 సెట్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఆల్రెడీ మొదలయ్యాయి. మొదటి భాగంలో ఉన్న షాక్ వాల్యూ రెండో భాగంలో వర్కవుట్ అవ్వడం అంత ఈజీ కాదు.
అలాగే హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’, సల్మాన్ ఖాన్ ‘కిక్ 2’ వంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో లేదో కూడా తెలియని గందరగోళం నెలకొంది. ఈ భారీ చిత్రాల హీరోలు, దర్శకులు తదుపరి భాగాల విషయంలో తొందర పడకుండా టైమ్ తీసుకోవడం వెనుక కథలపై నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణం అనిపిస్తోంది.
కేవలం ఫ్రాంచైజీ పేరుతో బిజినెస్ చేయాలని చూస్తే, ప్రేక్షకులను మోసం చేసినట్టే . సీక్వెల్స్ పేరుతో కాలయాపన చేయడం మానేసి, కొత్త కథలతో వస్తేనే ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మంచిది.

also read :‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

Related News

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×