E-Paper
Advertisement

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

Puri Connects: డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి ‘పూరీ కనెక్ట్స్’మొదలెట్టిన సంగతి తెల్సిందే.ఇక ఈ బ్యానర్ నుండి వస్తున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’అనే సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారంతా.అయితే రిలీజ్ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి ఒక్క పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

సాధారణంగా ఈ అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి సినిమాల ప్రమోషన్లు, టీజర్లు, పోస్టర్లు లేదా షూటింగ్ అప్‌డేట్లను మాత్రమే షేర్ చేస్తుంటారు.అలాంటిది సడెన్‌గా ఒక సెన్సేషన్ కామెంట్ పోస్ట్ అవడం అందరికి పెద్ద షాకే ఇచ్చింది.’ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా.. మంచోడికి చోటు లేదురా’ అంటూ పూరీ కనెక్ట్స్ ఖాతాలో పోస్ట్ చేసిన లైన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘాటైన వ్యాఖ్యకు సీరియస్‌నెస్‌ను తెలియజేసే ఎమోజీలు, డిసప్పాయింట్ ని సూచించే సింబల్స్ కూడా జోడించడంతో ఈ కాంట్రవర్సీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.


ఈ పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం
పూరీ జగన్నాథ్ మార్క్ సినిమాల్లో తరచుగా వినిపించే పవర్‌ఫుల్ డైలాగులను తలపిస్తున్న ఈ పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటనే దానిపై రకరకాలుగా డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.అయితే ఈ షాకింగ్ పోస్ట్ వెనుక రెండు కోణాలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ఏదైనా ఇన్సిడెంట్ లేదా బిజినెస్ వివాదాల వల్ల కలిగిన అసంతృప్తిని ఇలా ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తపరిచి ఉండవచ్చని అనుమానిస్తున్నారు కొందరు.గతంలో ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాల నుండి డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న కొన్ని ఫైనాన్షియల్ వివాదాల నేపథ్యంలో వచ్చిన ఆవేదన కావచ్చని వారి విశ్లేషణ.
సినీ ఇండస్ట్రీలో ఎవరి వల్లనైనా మోసపోవడం లేదా అన్యాయం జరగడం వల్లే పూరీ కనెక్ట్స్ ఇంత ఘాటుగా స్పందించి ఉంటుందని, అందుకే ‘మంచోడికి చోటు లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ ట్వీట్‌పై ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ కానీ, ఛార్మీ కౌర్ కానీ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ రూమర్లకు మరింత బూస్టప్ నిస్తుంది.

ప్రమోషన్ స్ట్రాటజీలో భాగమా ?
మరోవైపు, టాలీవుడ్ విశ్లేషకులు మరియు మెజారిటీ నెటిజన్లు దీనిని పూర్తిగా వేరే యాంగిల్‌లో చూస్తున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీ ఎప్పుడూ చాలా భిన్నంగా, కాంట్రవర్షియల్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేందుకు, సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి క్రిప్టిక్ పోస్టులు పెట్టడం పూరీకి కొత్తేమీ కాదు. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ అనే భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది.ఇందులో  విజయ్ సేతుపతి ఒక విభిన్నమైన, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. మురికివాడల నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలోని ఒక ముఖ్యమైన డైలాగ్ లేదా సినిమా థీమ్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగానే పూరీ కనెక్ట్స్ ఈ పోస్ట్ పెట్టి ఉండవచ్చని సినీ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.

నిజం ఏమై ఉంటుందో

ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, దునియా విజయ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ మరియు రీ-రికార్డింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
సినిమా స్టోరీ ప్రకారం హీరో వ్యవస్థపై తిరగబడే క్రమంలో వచ్చే ఘాటైన లైన్ ఇదై ఉంటుందని, త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి నిజంగానే ప్రమోషన్లలో భాగంగా ఇలా పోస్ట్ పెట్టాడా లేక మరేదైనా కారణం ఉందా !
also read :థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×