E-Paper
Advertisement

Sandeep Raj : రవితేజ కోసం విజయవాడ గ్యాంగ్ వార్స్ కథ, ఎందుకు పట్టాలెక్కలేదు?

Sandeep Raj : రవితేజ కోసం విజయవాడ గ్యాంగ్ వార్స్ కథ, ఎందుకు పట్టాలెక్కలేదు?
Advertisement

Sandeep Raj : ఈ రోజుల్లో ఒక దర్శకుడు కి ఒక హిట్ సినిమా పడితే ఇమ్మీడియట్ గా మరో సినిమా పట్టాలెక్కుతుంది. అలా త్వరగా ఇంకో సినిమా పట్టాలెక్కకపోయినా కూడా ఒక పెద్ద స్టార్ హీరో అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడు. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ చరణ్ తో సినిమా చేసే అవకాశం పొందుకున్నాడు. ఇప్పుడు పెద్ది సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కరోనా టైంలో వచ్చిన కలర్ ఫోటో సినిమా డైరెక్ట్ ఓటీటీ లో విడుదలైంది. అయితే ఆ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా గురించి పోస్టులు కూడా పెట్టారు. వీటన్నిటిని మించి ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డులు వచ్చినా కూడా వెండితెర మీద దర్శకుడుగా తమ పేరు చూసుకోవాలి అని ఆలోచన దర్శకుడికి ఉండటం సహజంగా జరుగుతుంది. ఆ కోరిక సందీప్ కి తీరలేదు.

రవితేజ కోసం గ్యాంగ్ వార్స్ కథ

Advertisement

కలర్ ఫోటో సినిమా అయిపోయిన తర్వాత రవితేజ హీరోగా సందీప్ రాజ్ సినిమా చేస్తాడు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది అనుకునే తరుణంలో అది మిస్ అయింది. అయితే రవితేజ కోసం విజయవాడ బ్యాక్ డ్రాప్ లో జరిగే గ్యాంగ్ వార్స్ కథను సిద్ధం చేశాడు సందీప్. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు.

సందీప్ కి విజయవాడ గురించి మంచి అవగాహన ఉంది. అక్కడే పెరగడంతో తాను చూసిన కొన్ని పరిస్థితులను కథగా మలిచి రవితేజ కోసం దానిని సిద్ధం చేశాడు. సందీప్ రాజ్ తో రవితేజ సినిమా చేయకపోయినా కూడా, ఇప్పుడు రవితేజ చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అయితే కాలేజీ లైఫ్ లో చూసిన వాటిని ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే సిరీస్ లో చూపించాడు. ఆ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించాడు.

అందుకే మొగ్లి కథ సిద్ధం

Advertisement

ఎన్నో అంచనాలు పెట్టుకున్న రవితేజ సినిమా వర్కౌట్ కాలేదు కాబట్టి రోషన్ హీరోగా మోగ్లీ అనే సినిమాను తాను తెరకెక్కించినట్లు చెప్పాడు సందీప్. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి టీజర్ అప్పుడు కూడా రామ్ చరణ్ మాట్లాడుతూ చాలా టైం అయిపోయింది సందీప్ త్వరగా సినిమాలు చెయ్ అంటూ చెప్పారు. రామ్ చరణ్ హీరోగా కూడా సందీప్ సినిమా చేసే అవకాశం ఉంది.

Also Read: Bandi Saroj Kumar: బాలయ్య అభిమానులు ఫైర్ చూపించారు, నటుడికి పొగడ్తలు డైరెక్టర్ కి తిట్లు

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×