Bandi Saroj Kumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు బండి సరోజ్ కుమార్. ఇండస్ట్రీ పరిస్థితులను తట్టుకోలేక తనకంటూ ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేసుకునే ప్లాన్ లో ఎదిగాడు. యూట్యూబ్ వేదికగా నిర్బంధం, మాంగల్యం అని సినిమాలు చేసి చాలా మంది ఫ్యాన్స్ ను తనకంటూ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను దర్శకత్వం వహించిన సూర్యస్తమయం సినిమా థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఆ సినిమాకు అప్పుడు కూడా పలు వివాదాలు చుట్టుకున్నాయి. దానికి సంబంధించి కొన్ని సీన్స్ ట్రిమ్ చేశారు అంటూ అప్పట్లో సరోజ్ యూట్యూబ్ వేదిక గానే మాట్లాడాడు.
ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా పరాక్రమం అనే సినిమాను డిజైన్ చేశాడు. అయితే యూట్యూబ్లో బూతులు విని వచ్చిన అభిమానులు ఆ సినిమాతో నిరాశ చెందారు. పక్క ఫ్యామిలీ కంటెంట్ అయిపోవడం వలన పెద్దగా ఎవరికి ఆ సినిమా ఎక్కలేదు దాని వలన దాదాపు రెండు కోట్ల వరకు నష్టపోయాడు బండి సరోజ్. ఇక సరోజ్ ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకత్వంలో మొగ్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ అభిమానులు అఖండ 2 సినిమా కోసం ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాసేపట్లో ప్రీమియర్స్ మొదలైపోతాయి అనుకున్న టైంలో ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ డేట్ పైన క్లారిటీ రాలేదు. మొత్తానికి ఆ సినిమా డిసెంబర్ 12న ప్రాక్ స్కూల్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ తరుణంలో అదే డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. అందులో భాగంగా మోగ్లీ సినిమా కూడా వాయిదా పడేటట్లు ఉంది. ఇ తరుణంలో బండి సరోజ్ అఖండ టు సినిమా గురించి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు.
బాలయ్య అభిమానుల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను మొత్తానికి అనుకున్నది సాధించారు. బాలయ్య అభిమానుల ఫైర్ చూపించారు. మోగ్లీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ కూడా చర్చల్లో ఉంది. ఆ సినిమాను కూడా మీరు ఆదరించాలి అని కోరుకుంటున్నాను.
I feel happy for the fans. మొత్తానికి అనుకున్నది సాధించారు 🔥 బాలయ్య అభిమానుల ఫైర్ చూపించారు ♥️ #Mowgli release date re-confirmation కూడా చర్చల్లో ఉంది. ఆ సినిమాను కూడా మీరు ఆదరించాలి అని కోరుకుంటున్నాను. Once again congratulations 🎉 #Akhanda2 pic.twitter.com/TRBKFEmRcR
— Saroj (@publicstar_bsk) December 9, 2025
అయితే నేడు దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు ఎమోషనల్ అవుతూ తన సినిమాకి జరిగినదాన్ని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. దానిని బాలయ్య అభిమానులు బాగా మనసులో పెట్టుకొని డైరెక్టర్ సింపతి గ్రామాలు ఆడుతున్నాడు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు నీకోసం సినిమా చూస్తాం అన్నా అంటూ సరోజ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Roshan Kanakala : మా ఇంట్లో ఆ సీడీ ఉండేది, ఆ సినిమా నా మీద విపరీతమైన ప్రభావం చూపించింది