Mowgli Release Date : బుల్లితెర యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ నటిస్తున్న రెండో మూవీ మోగ్లీ.. ఈ డిసెంబర్ 12కి రిలీజ్ కావాలి. అదే డెడ్ లైన్ తో అంతా పనిచేశారు. ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా ‘మోగ్లీ’ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ చివరకు అదే నిజమైంది. అఖండ 2 12 న రిలీజ్ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో రోషన్ మూవీ వాయిదా పడిపోయింది.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ గట్టిగానే చేశారు.. కానీ మూవీ వాయిదా పడటం చిత్రయూనిట్ కు నిరాశను మిగిల్చింది.. తాజాగా ఈ మోగ్లీ మరో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ప్రీమియర్ షోలు ఎప్పుడు పడతాయన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలయ్య నటించిన అఖండ 2 సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని చివరి కారణాలవల్ల ఆ సినిమా వాయిదా పడింది.. మూవీ కొత్త రిలీజ్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేశారు.. అన్ని చర్చల తర్వాత డిసెంబర్ 12న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ క్రమంలో డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడినట్లు తెలుస్తుంది.. అందులో రోషన్ కనకాల నటించిన మోగ్లీ కూడా ఉంది. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతుందని అందరు అనుకున్నారు. అఖండ 2 వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త డేట్ ను ప్రకటించినట్లు తెలుస్తుంది. 12 న సాయంత్రం ప్రీమియర్ షోలు పడుతున్నాయని తెలుస్తుంది.. 13 న సినిమా థియేటర్లలోకి రాబోతుంది. దీనిపై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Also Read : అక్షయ్ దగ్గర నిజం దాచిన అవని.. కమల్, పల్లవి రొమాన్స్.. చక్రధర్ ప్లాన్ సక్సెస్..
డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. దాంతో సినిమాని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. నిజానికి డిసెంబర్ 12న 16 సినిమాలకు పైగా విడుదల కావాల్సి ఉన్నాయి.. అఖండ 2 సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో ఆ సినిమాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.. రోషన్ కనకాల, సందీప్ రాజ్ మోగ్లీ, బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్న హర్రర్ సినిమా ఈషా రెండు చిత్రాలు తమ విడుదలలను చిన్నపిల్లలకి పెళ్లిఅధికారికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిసిందే.. అయితే ఒక్క రోజు తర్వాత డిసెంబర్ 13 న మోగ్లీ థియేటర్లలోకి రానుంది. మరి మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఏది ఏమైనా కూడా డిసెంబర్ నెలలో సినిమాలన్నీ కూడా దాదాపు వాయిదా పడుతూ వస్తున్నాయి.. అఖండ 2 కోసం నెక్స్ట్ ఏ మూవీ వెనక్కి వెళ్తుందో చూడాలి..