E-Paper
Advertisement

Google GPS: జిపిఎస్ ఆఫ్ చేసినా మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్న గూగుల్.. ఈ సెట్టింగ్స్ మార్చండి

Google GPS: జిపిఎస్ ఆఫ్ చేసినా మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్న గూగుల్.. ఈ సెట్టింగ్స్ మార్చండి
Advertisement

Google GPS| స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తారు. ఈ రెండు ఫోన్లలో కూడా గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, యూట్యూబ్ దాదాపు అందరూ ఉపయోగిస్తారు. ఈ యాప్స్.. మీ లొకేషన్, కాంటాక్ట్స్, మెసేజ్‌లకు యాక్సెస్ అడుగుతాయి. ఫోన్ లో లొకేషన్ తెలిపే జిపిఎస్ (GPS) ఆఫ్ చేస్తే గూగుల్ ట్రాక్ చేయలేదని అందరూ భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. సెట్టింగ్స్ లో GPS ఆఫ్ చేసి ఉన్నా.. గూగుల్ మీ ఫోన్ లొకేషన్‌ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది యూజర్ల ప్రెవెసీకి ప్రమాదకరం. అయితే దీన్ని ఆపడం మీ చేతుల్లోనే ఉంది.

గూగుల్ వైఫై, బ్లూ టూత్ ద్వారా రెండు రకాలు మీ ఫోన్ ని ట్రాక్ చేయగలదు.

Wi-Fi ద్వారా ట్రాకింగ్ ఎలా జరుగుతుంది?

Advertisement

మీ ఫోన్ ఎప్పుడూ చుట్టుపక్కల ఉన్న Wi-Fi నెట్‌వర్క్‌లను స్కాన్ చేస్తూ ఉంటుంది. ఆ నెట్‌వర్క్‌లతో మీ ఫోన్ కనెక్ట్ చేయకపోయినా ఫోన్ లొకేషన్ ట్రాక్ అయిపోతుంది. దీనికి ఆ నెట్‌వర్క్‌ కనెక్షన్ తో పనిలేదు. కేవలం ఆ నెట్‌వర్క్ పేర్ల ద్వారా మీ లొకేషన్‌రి గూగుల్ గుర్తిస్తుంది. ఇలా ట్రాక్ చేయడానికి జిపిఎస్ అవసరం లేదు.

Wi-Fi ట్రాకింగ్ ఆపడానికి ఇలా చేయండి

ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. “Location” ఆప్షన్‌కి వెళ్లండి. అందులో “Wi-Fi Scanning” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా ఆఫ్ చేయండి. ఇకపై Wi-Fi ద్వారా ట్రాకింగ్ ఆగిపోతుంది.

బ్లూటూత్ ద్వారా ట్రాకింగ్ ఎలా జరుగుతుంది?

Advertisement

మీ ఫోన్ బ్లూటూత్ ఆన్ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఇతర బ్లూటూత్ డివైస్‌లను స్కాన్ చేస్తుంది. ముందు కనెక్ట్ అయిన హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ లొకేషన్ ద్వారా కూడా గూగుల్ మీ ఉనికిని గుర్తిస్తుంది.

బ్లూటూత్ ట్రాకింగ్ ఎలా ఆపేయాలి?

సెట్టింగ్స్‌లో “Location”కి వెళ్లండి. అందులో “Bluetooth Scanning” అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయండి. ఇక బ్లూటూత్ ద్వారా ట్రాకింగ్ ఆగిపోతుంది.

లొకేషన్ హిస్టరీతో కూడా ట్రాకింగ్

మీరు గతంలో ఎక్కడికి వెళ్లారు, అక్కడ ఎంతసేపు ఉన్నారు, ఏ మార్గంలో వెళ్లారు.. ఇవన్నీ గూగుల్ సేవ్ చేసుకుంటుంది. దీన్ని చూసి మీ భవిష్యత్ లొకేషన్ కూడా ఊహిస్తుంది. ఈ డేటా ఎవరికైనా హాని చేయొచ్చు.

లొకేషన్ హిస్టరీ డిలీట్ చేయాలి

సెట్టింగ్స్‌లో మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి. “Data & Privacy” — “Web & App Activity”కి వెళ్లి ఆఫ్ చేయండి. పాత డేటా కూడా డిలీట్ చేసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి

  • అవసరం లేనప్పుడు GPS, Wi-Fi, బ్లూటూత్ ఆఫ్ చేయండి
  • యాప్స్‌కి లొకేషన్ పర్మిషన్ ఇవ్వకూడదు
  • నెలకోసారి లొకేషన్ హిస్టరీ డిలీట్ చేయండి
  • మంచి యాంటీవైరస్ ఉపయోగించండి.

మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ ట్రాకింగ్ ఆపేయండి!

Also Read: గూగుల్ క్రోమ్‌‌ని వెంటనే డెలీట్ చేయండి.. ఐఫోన్ యూజర్లకు సీరియస్ వార్నింగ్

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×